Begin typing your search above and press return to search.
కొరటాల ఎలా బ్యాలెన్స్ చేస్తాడో!!
By: Tupaki Desk | 24 Jun 2016 4:26 AM GMTజనాలు ఎక్కువైతే మజ్జిక పల్చనవుతుంది అనే సామెత ఊరికనే చెప్పలేదు మన పెద్దోళ్ళు. ఇది సినిమాకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఒకే సినిమాలో ఉత్తినే చాలామందిని పెట్టేస్తే.. అప్పుడు తెలుస్తుంది ఈ సామెత విలువ ఏంటో. మొన్న బ్రహ్మోత్సవం సినిమాలో ఇలాగే ఒక్కొక్క షాట్ లో కనిపించడం కోసం కూడా పేరును నటులను దింపారు. చివరకు.. ఆ నటులను సరిగ్గా వాడుకోలేదనే కామెంట్స్ వినాల్సి వచ్చింది.
ఇకపోతే ఇప్పుడు 'జనతా గ్యారేజ్' సినిమాలో కూడా ఇలాగే చాలామంది ఆర్టిస్టులు కనిపిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ - సమంత - నిత్యా మీనన్ ను లీడింగ్ రోల్స్ లో ఇరగదీస్తుంటే.. వారి ప్రక్కనే సాయికుమార్ - మోహన్ లాల్ - బ్రహ్మాజీ - అజయ్ తదితరులు కనిపించనున్నారు. దేవయాని - విదీషా కూడా ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. వీళ్లందరికీ సరిపడే స్ర్కీన్ టైమ్ తో పాటు.. ఆడియన్స్ శాటిస్ఫై అయ్యేంత లెంగ్త్ ఉండే క్యారెక్టర్లు కూడా కట్టిపెట్టాలి. లేకపోతే వారిని సరిగ్గా వాడుకోలేదు అనే విమర్శ వస్తుంది. ఇలాంటి ఈక్వేషన్లన్నీ కొరటాల శివ సరిగ్గా బ్యాలెన్స్ చేయాల్సిందే.
జూలై 6న తొలి టీజర్ రాబోతుందని ఇప్పటికే అఫీషియల్ గా మైత్రీ మేకర్స్ వారు ప్రకటించారు. లెటజ్ వెయిట్!!