Begin typing your search above and press return to search.

ఆ విషయంలో కొరటాల చాలా సూపరేహా

By:  Tupaki Desk   |   29 Aug 2016 5:30 PM GMT
ఆ విషయంలో కొరటాల చాలా సూపరేహా
X
మామూలుగా చాలామంది దర్శకులు తాము సినిమాల్లో చూపించే నీతికీ.. తమ రియల్ లైఫ్‌ లో చేసే పనులకీ.. ఎటువంటి లింకులూ పెట్టుకోరు. సినిమాలో పేజీలకు పేజీలు నీతులు బోధిస్తూ ఉంటూ.. బయట మాత్రం చేయాల్సిన చెత్తంతా చేసేస్తారు. అయితే దర్శకుడు కొరటాల శివ మాత్రం.. వీళ్లందరికంటే కాస్త డిఫరెంట్ గయ్.

మనోడు జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ ను ఒక నేచర్ లవర్ గా చూపిస్తున్నాడు. మొక్కలను ప్రేమిస్తూ.. చెట్ల కోసం జీవిస్తూ.. వాతావరణాన్ని ఇష్టపడుతూ.. ఒక ప్రకృతి ప్రేమికుడిగా యంగ్ టైగర్ కనిపిస్తాడు. అయితే ఇదంతా కూడా డైరెక్టుగా కొరటాల శివ తనని తాను కాపీ చేసుకుని ఇక్కడ పేస్టు చేశాడు. తను నివసించే అపార్టుమెంటులో చాలా మొక్కలను పెంచుతాడట. ఇంకా వేరే చోట్ల కూడా చాలా మొక్కలు పెంచుతున్నట్లు చెప్పాడు కొరటాల. తన సినిమాలన్నింటిలోనూ హీరోలు ప్రకృతి ప్రేమికులుగానే కనిపిస్తారని.. ఎందుకంటే తను రియల్ లైఫ్‌ లో ప్రకృతిని ఇష్టపడతాను కాబట్టే.. అని చెప్పాడు.

నిజానికి చాలామంది దర్శకుడు సినిమా కోసం కథలను క్యారక్టరైజేషన్లు పుట్టిస్తుంటారు. అయితే కొరటాల మాత్రం తను రియల్ లైఫ్‌ లో ఎలా ఉంటాడో అలాంటి క్యారెక్టర్లే చేయడం చాలా ఆనందకరమైన విషయమే. అందుకే కదా.. మనోడి సినిమాలన్నీ కమర్షియల్ ఫార్మాట్ లో ఉన్న మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లా ఉంటాయ్. నువ్వు సూపర్ కొరటాల.