Begin typing your search above and press return to search.
శ్రీమంతుడు కంటే జనతా గ్యారేజే బెటర్
By: Tupaki Desk | 2 Sep 2016 5:30 PM GMT'శ్రీమంతుడు కంటే జనతా గ్యారేజ్ చాలా బెటర్ సినిమా' అని కొందరు పంపిణీదారులు మన దర్శకుడు కొరటాల శివకు చెప్పారట తెలుసా? అవును.. ఈ విషయం స్వయంగా సక్సెస్ మీట్ లో మాట్లాడిన ఆయనే చెప్పారు. కాకపోతే ఈ డైలాగ్ చెప్పుకోవడానికి చాలా బాగుందేమో కాని.. వినడానికి మాత్రం కాస్త ఇబ్బందిగా ఉందని అంటున్నారు సినిమా లవర్స్. ఎందుకంటే.. చూద్దాం పదండి.
''డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి ఫస్ట్ వీక్ లోనే సేఫ్ అయిపోతామని చెప్పారు. శ్రీమంతుడు కంటే బెటర్ సినిమా అని చెప్పడం ఆనందాన్నిస్తుంది. చాలా మంచి సినిమా. ఇలాంటి సినిమాలే తీయ్ అని చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు'' అని చెప్పాడు కొరటాల. బాగానే ఉంది. అయితే 'శ్రీమంతుడు' సినిమాలో ఒక గ్రామాన్ని కాపాడాలంటే.. పట్టణాల్లో సంపాదించిన వారంతా చక్కగా విలేజెస్ కు వెళ్ళి దత్తత తీసుకుని సేవ చేయాలనే మెసేజ్ ఉంది. కాని జనతా గ్యారేజ్ లో ఏముంది?? ఎవరన్నా నేచర్ ను స్పాయిల్ చేస్తే.. వెంటనే వాళ్లకు అడ్డుపడి.. వాళ్ళను కొట్టేయాలనే నీతి తప్పించి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇచ్చిన ఫైనల్ మెసేజ్ అదే కదా. అలాంటప్పుడు శ్రీమంతుడు కంటే జనతా గ్యారేజ్ బెటర్ అనడం ఎంతవరకు కరక్ట్? అని ప్రశ్నిస్తున్నారు సినిమా లవర్స్.
ఇకపోతే ఏ సినిమాతోనూ కంపేర్ చేయకుండా 'జనతా గ్యారేజ్' సినిమాకు వస్తున్న రెస్పాన్స్ మాత్రం బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో వచ్చిన హై మాత్రం ప్రేక్షకులకు అద్బుతంగా నచ్చింది. అది సంగతి.