Begin typing your search above and press return to search.

కొరటాల ఆ సినిమా గురించి గొప్పగా చెప్పాడే..

By:  Tupaki Desk   |   14 Nov 2016 11:30 AM GMT
కొరటాల ఆ సినిమా గురించి గొప్పగా చెప్పాడే..
X
మంచి సినిమా తీస్తే సరిపోదు. దాన్ని సరిగ్గా ప్రమోట్ చేయాలి. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టీం ఈ విషయంలో పక్కా ప్లానింగ్ తో అడుగులేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా వచ్చిన ప్రోమోస్ అన్నీ ఇది మంచి సినిమా అన్న భావన కలిగించాయి. మరోవైపు దీన్ని ప్రమోట్ చేస్తున్న తీరు కూడా ఆకట్టుకుంటోంది. త్రివిక్రమ్.. సుకుమార్ లాంటి పెద్ద దర్శకులతో దీని మోషన్ పోస్టర్.. టీజర్ రిలీజ్ చేయించారు. ఇప్పుడు కొరటాల శివ లాంటి మరో స్టార్ దర్శకుడు ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా కొరటాల ఈ సినిమా గురించి చెప్పిన మాటలు కూడా ఆ చిత్ర యూనిట్ కు ఉత్సాహాన్నిచ్చేవే.

‘‘శ్రీనివాస్‌ రెడ్డి నాకు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమా చూపించాడు. బాగా ఎంజాయ్ చేశాను. ఇటీవలి కాలంలో ఇంత మంచి సినిమా నేను చూడలేదు. ఈ సినిమా చూశాక.. మన చుట్టూ ఉండే మనుషుల్లోంచి ఎన్ని పాత్రలు సృష్టించవచ్చో నాకు అర్ధమైంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు దర్శక నిర్మాత శివరాజ్ కనుమూరి నాకు కృతజ్ఞతలు చెబుతున్నాడు. కానీ ఇంత మంచి సినిమా ప్రచారంలో పాలు పంచుకుంటున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి రెండున్నర గంటల పాటు నాకు హీరోలానే కనిపించాడు. మా అన్నయ్యగారి అబ్బాయి రవిచంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించాడని ఆలస్యంగా తెలిసింది. రవిచంద్ర సమకూర్చిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలో ఒకటని చెప్పొచ్చు’’ అని కొరటాల అన్నాడు. కొరటాల లాంటి దర్శకుడు ఇంత పాజిటివ్ గా మాట్లాడాడంటే.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మంచి ఫలితమే రాబట్టేలా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/