Begin typing your search above and press return to search.

సమంత దొరికింది వాడేద్దాం అంటే కష్టం

By:  Tupaki Desk   |   19 Sep 2016 7:30 PM GMT
సమంత దొరికింది వాడేద్దాం అంటే కష్టం
X
'ఏదో సమంతకు లక్షల్లో ఇచ్చాం..దొరికింది కాబట్టి వాడేద్దాం అంటే ఎలా? కష్టమే కదా. నాకంటే ఎక్కువ ఈ క్యారక్టర్ ను నమ్మింది సమంతే. అలాగే ఆడియన్స్ కూడా సమంత రోల్ బాగా నచ్చింది. ఇలాంటి గాసిప్స్ క్రియేట్ చేసింది కొందరు క్రిటిక్సే. సమంత ఎంత సేపు ఉండాలనేది చెపడం ఏంటి? సినిమాలో బొక్కలు వెతక్కుండా ఎక్సపీరియన్స్ అనుభవించండి'' అంటూ సెలవిచ్చాడు కొరటాల శివ. అసలు జనత్యా గ్యారేజ్ సినిమా 3వ అతి పెద్ద గ్రాసర్ గా అవతరిస్తున్న వేళ.. ఇలా సమంతకు సరైన రోల్ ఇవ్వలేదని.. ఆమె రోల్ నిడివి సరిగ్గా లేదని.. కొరటాల ఆమె ఫ్యాన్స్ కు అన్యాయం చేశాడని వస్తున్న కామెంట్లకు భలే సమాధానం చెప్పాడు ఈ డైరక్టర్.

సినిమాలో ఏ పాత్ర అయినా కూడా ఎంత సేపు ఉంది అనే విషయం ముఖ్యం కాదని.. ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనే విషయమే ముఖ్యం అంటున్నాడు. ''సినిమాలో రాజీవ్ 7 మినిట్స్ ఉంటారు. కాని మోహన్ లాల్ అండ్ ఎన్టీఆర్ గురించి ఎంత మట్లాడారో అంతగా రాజీవ్ గురించీ మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఇంపాక్ట్ ను నమ్మాలి కాని.. డ్యురేషన్ చూడటం ఏంటి? సినిమా అంతా ఉండి గోల చేయడం కంటే.. ఉన్న పది నిమిషాలు ఏడిపించి వెళ్ళిపోవడం బెటర్ అని నమ్ముతాను నేను'' అని చెప్పాడు కొరటాల శివ. తనకు సినిమాను రాసేటప్పుడు.. ఏ రోల్ ఎలా ప్రవర్తిస్తుంది అని అనిపిస్తే అలాగే రాస్తాను కాని.. లాజిక్కులు చూడనని కూడా అన్నాడు.