Begin typing your search above and press return to search.
నేను సందేశాలిచ్చే టైపు కాదు- కొరటాల
By: Tupaki Desk | 1 Aug 2015 9:37 AM GMTఓ సినిమా ట్రైలర్లో ఊరు, దత్తత అనే మాటలు వినిపించాయంటే ఇదేదో సందేశాత్మక సినిమాలా ఉందే అన్న అభిప్రాయం కలగడం సహజం. శ్రీమంతుడు సినిమా ఇలాంటి భావనే కలిగించింది అభిమానులకు. పైగా జాగో జాగో పాట వింటుంటే అందులో హీరో క్యారెక్టరైజేషన్ అర్థమైపోతోంది. ఏదో మంచి చేయాలనే తలంపుతో హీరో ఉంటాడని తెలుస్తోంది. ఐతే ఓ స్టార్ హీరో సినిమాలో మరీ ఎక్కువ మంచి చూపిస్తే జనాలు తట్టుకోలేరు. కమర్షియల్ యాంగిల్ మిస్సయితే ఒప్పుకోరు. ఐతే డైరెక్టర్ కొరటాల ఈ విషయంలో అభిమానులు కంగారు పడాల్సిందేమీ లేదని.. తాను సందేశాత్మక చిత్రాలు చేసే టైపు కాదని.. కొంచెం మంచి జోడించి పక్కా కమర్షియల్ సినిమా తీశానని అంటున్నాడు.
‘‘నాకు సాధారణంగా సందేశాలివ్వడం అస్సలిష్టం ఉండదు. నేను సందేశాలు తీసుకోను, ఎవ్వరికీ ఇవ్వను కూడా. ప్రతి ఒక్కరికీ జీవితమంటే ఏంటో వాళ్లకే బాగా తెలుసు. ఇంకొకరొచ్చి ఏదీ చెప్పాల్సిన పని లేదు. అలా చెబితే ఇంకా కోపం వస్తుంది కూడా. ఎవరికైనా ఏదైనా చెప్పడానికి కూడా జనాలు ఇష్టపడరు. ఈ జనరేషన్ వాళ్లందరి మెంటాలిటీ ఇలాగే ఉంటుంది. వాళ్లు ఏదైనా సంఘటన చూసి వాళ్లంతట వాళ్లు స్ఫూర్తి పొందుతారు తప్పితే.. ఎవరో వచ్చి ఇలా చేయండి అలా చేయండి అంటే అస్సలు వినరు. వ్యక్తిగతంగా నేను సందేశాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తా. శ్రీమంతుడు సినిమాలో ప్రీచింగ్ లాంటిది.. క్లాసులు పీకడం లాంటిది ఉండదు. ఒక డబ్బున్నవాడొచ్చి ఊరిని దత్తత తీసుకుని.. డబ్బులు ఖర్చు పెట్టి వెళ్లిపోయాడంటే అది డాక్యుమెంటరీ లాగా ఉంటుంది. కానీ ఇందులో హీరో ఊరిలోని చెడ్డవాళ్లను కూడా దత్తత తీసుకుంటాడు. ఇందులో కమర్షియల్ యాంగిల్ ఉంది. ఒక కొత్త ఎక్స్ ప్రెషన్ పట్టుకుని దాన్ని కమర్షియల్ గా, ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్దాను’’ అని కొరటాల చెప్పాడు.