Begin typing your search above and press return to search.
గోదారి ఇసుక రీచ్ లలో CHIRU 152 యాక్షన్
By: Tupaki Desk | 9 Feb 2020 5:50 AM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 152వ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. హైదరాబాద్ -కోకాపేటలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లలో చిత్రీకరణ సాగుతోంది. దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ పై కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఓ ప్రత్యేక గీతంలో రెజీనా కసాండ్ర కూడా నటించనుంది. ఇప్పటికే ఆ పాట చిత్రీకరణ పూర్తిచేసినట్లు సమాచారం. అయితే ఈ షెడ్యూల్ అనంతరం కొరాటల టీమ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో.. గోదారి అందాల నడుమ భారీ షెడ్యూల్ కు సన్నాహాలు చేస్తున్నారు. కొకాపేట్ తర్వాత షూటింగ్ రాజమండ్రికి షిప్ట్ కానుందిట.
అక్కడ మేజర్ పార్ట్ షూటింగ్ జరగనుంది. రాజమండ్రి..కొవ్వూరు ప్రాంతాలతో పాటు...ఇసుక రిచ్ లలో భారీ యాక్షన్ సన్నివేశాన్ని కూడా షూట్ చేయనున్నారుట. దానికి సంబంధించిన ఏర్పాట్ల బాధ్యతను అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడుకి అప్పజెప్పారట. చిరంజీవి సినిమా షూటింగ్ అవుట్ డోర్ లో జరిగితే అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. దీనిలో భాగంగా వ్యక్తిగత సిబ్బందిని కూడా పెంచుతున్నట్లు సమాచారం. ఆ ఏర్పాట్లన్నీ స్వామినాయుడు చూస్తున్నారట. దేవాలయ భూముల కుంభకోణం నేపథ్యంలో కథాంశాన్ని ఎంచుకున్న కొరటాల పక్కా సోషల్ మెసేజ్ తో పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇసుక రీచ్ లలో యాక్షన్ ఎపిసోడ్స్ అంటే.. కుంభకోణాలు సెటిల్ మెంట్లకు ఇసుక రీచ్ లతో లింకులేమిటి? అని అడగొద్దు. మాఫియాలు తచ్చాడే ప్లేస్ అది కాబట్టి అక్కడ అయితేనే బావుంటుందని ప్లాన్ చేశారన్నమాట.
ఇక ఇందులో రామ్ చరణ్ మెగాస్టార్ యంగర్ వెర్షన్ సిద్ధు అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్ కోసం వచ్చే ఏడాది వరకూ వెయిట్ చేయాల్సిందేనని ఇప్పటికే ప్రచారమైంది. కొరటాల అప్పటివరకూ వెయిట్ చేస్తాడా? లేక మరో నటుడితో ఆ స్థానాన్ని భర్తీ చేస్తారా? అన్నది చూడాలి. ఇందులో చిరంజీవికి జోడీగా త్రిష నటించనుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్-కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.