Begin typing your search above and press return to search.
15 కోట్ల అఫర్ ను రిజెక్ట్ చేసిన కొరటాల?
By: Tupaki Desk | 19 March 2018 5:55 AM GMTఓ వయసుకు రాగానే స్టార్ హీరోల కుమారులు చాలా వరకు సొంత నిర్ణయాలతోనే ప్రయత్నాలు మొదలుపెడతారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యువ వారసులు మొత్తం తండ్రుల ప్రమేయం లేకుండా సినిమాలను ఒకే చేస్తూ ముందుకు వెళుతున్నారు. కానీ అక్కినేని వారసులు మాత్రం ఇంకా తండ్రి ఆలోచనలతోనే కెరీర్ ను సెట్ చేసుకుంటున్నారు. అఖిల్ కు కమర్షియల్ హిట్ ఇవ్వాలని నాగ్ గత కొంత కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
మొదటి రెండు సినిమాలు అఖిల్ - హలో అనుకున్నంత రేంజ్ లో కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. దాదాపు నష్టాలనే చూడాల్సి వచ్చింది. ఇక మూడవసారి ఒక ఫైనల్ డిసిషన్ తో నాగ్ అఖిల్ కోసం భారీ ప్రాజెక్ట్ సెట్ చేయాలనీ చూస్తున్నాడట. అందుకోసం కమర్షియల్ దర్శకులను బాగానే వెతుకుతున్నాడు. ముఖ్యంగా కొరటాలతో ఆ మధ్య నాగ్ గట్టిగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడికి దాదాపు 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ అఫర్ చేశాడట.
కానీ నాగ్ అఫర్ ని కొరటాల రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఇతర హీరోలతో ఆల్ రెడీ కొరటాల ఇతర హీరోలకు కమిట్మెంట్స్ ఇవ్వడం వలన సున్నితంగా ఇప్పుడు చేయలేను అని చెప్పినట్లు తెలుస్తోంది. నాగ్ కూడా పెద్దగా ఫీల్ అవ్వకుండా ఇట్స్ ఒకే అనేశారట. ప్రస్తుతం కొరటాల శివ మహేష్ - భరత్ అనే నేను సినిమాకు తుది మెరుగులు దిద్దుతోన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలలో ఆ సినిమా విడుదల కానుంది.