Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కంటే పెద్దది అదే -కొరటాల శివ

By:  Tupaki Desk   |   28 July 2017 5:49 PM GMT
డ్రగ్స్ కంటే పెద్దది అదే -కొరటాల శివ
X
ఇప్పుడు టాలీవుడ్లో ఎటు తిరిగినా కూడా చివరకు టాపిక్స్ అన్నీ డ్రగ్స్ దగ్గరే వచ్చి ఆగుతున్నాయి. అందులోనూ పూరి జగన్ నుండి రవితేజ వరకు.. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలను ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్రశ్నించింది కాబట్టి.. అసలు ఈ కేసు ఏ మలుపు తిరుగుతందో అనే ఆతృత అందరిలోనూ ఉంది. కాని దానికంటే పెద్ద విషయం ఏంటంటే.. అసలు డ్రగ్స్ అనే ఇష్యూను భూతద్దంలో చూపించేసి.. రాష్ట్రంలోని మిగతా సమస్యలను స్కాములను గాలికి వదిలేస్తున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

ఒక ప్రక్కన టాలీవుడ్ ప్రముఖులు అందరూ 'సే నో టు డ్రగ్స్' అంటూ నినదిస్తున్న వేళ.. ఇప్పుడు స్టార్ డైరక్టర్ కమ్ రైటర్ కొరటాల శివ తనదైన శైలిలో ఒక మాటన్నాడు. కొరటాల సినిమాలను చూస్తే ఆయనకు సామాజిక స్పృహ ఎంతుందో చెప్పొచ్చు. ఎప్పుడూ సమాజానికి ఏదో చేయాలనే తపిస్తాడు. అందుకే ఇప్పుడు తను ఏమంటున్నాడంటే.. ''ప్రతీ ప్రభుత్వం అవినీతిని అంతమొందించడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను నెలకొల్పాలని ఆశిస్తున్నాను. డ్రగ్స్ కంటే కూడా అవినీతి అనేది చాలా ప్రమాదకరం'' అంటూ ట్వీటేశాడు కొరటాల. మరి మనోడు చెప్పినదాంట్లో కూడా పాయింట్ ఉంది.

డ్రగ్స్ అనేది ప్రమాదకరమే కాని.. అది వాటిని వాడుతున్న వ్యక్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అదే అవినీతి అయితే.. లక్షల కోట్ల స్కాములు జరిగితే.. తద్వారా వచ్చే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కారణంగా కోట్ల మంది సామాన్య మానవుల జీవితాలు తారుమారు అవుతాయి. రేట్లు పెరగడానికి ఈ కరప్షన్ అనేదే ఒక పెద్ద సమస్య. అలా రేట్లు పెరగడం వలన సామాన్య మానవుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో మనకు తెలిసిందే. అందుకే కొరటాల చెప్పింది వ్యాలిడ్ పాయింటే. మరి ప్రభుత్వాలు ఇలాంటి సూచనలను పట్టించుకుంటాయా?