Begin typing your search above and press return to search.
బహిరంగంగా బాధపడిన కొరటాల శివ
By: Tupaki Desk | 12 Aug 2015 5:15 PM GMTప్రస్తుతం టాలీవుడ్ లో కొరటాల శివ అన్నది ట్రేండింగ్ నేమ్... హీరోయిజాన్ని ఎలివేట్ చెయ్యడానికి ప్రాస డైలాగులు, పంచు డైలాగులు, భయంకరమైన యాక్షన్ సీక్వెన్స్ లు అవసరం లేదని, అందమైన కధకు ఆలోచింపజేసే రచన తోడైతే ప్రేక్షకులు పరిగెత్తుకొచ్చి సినిమా చూస్తారని నిరువుపించాడు. మిర్చితో దర్శకుడిగా ఘనమైన ఎంట్రీ ఇచ్చిన కొరటాల శివ శ్రీమంతుడితో ద్వితీయ విఘ్నాన్ని కూడా జయించాడు.
అయితే తన మెదడులో వున్న పాత్రలను తెరపైకి తీసుకురావడానికి ఎన్నాళ్ళు సమయం పట్టిందో, తన మనసులో వున్న బాధలని బయటపెట్టడానికి అంతకన్నా ఎక్కువ టైమే పట్టింది. తెలుగు ఇండస్ట్రీలో రచయితల కొరతపై గళం విప్పాడు. సేవ్ టైగర్స్ లా సేవ్ రైటర్స్ అని నినాదం అవసరమన్నాడు. రచయితలకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందిగా నిర్మాతలను, దర్శకులను, స్టార్ హీరోలను కోరడం విశేషం.
రచయితల కొరతకు ప్రధాన కారణం వారికి రావాల్సిన గుర్తింపు, డబ్బు రావడం లేదని, వారి సృజనను దొంగతనం చేస్తున్నారని తెలిపాడు. డబ్బుకన్నారచయితలకు గుర్తింపు ముఖ్యమని తెలిపాడు. వింటుంటే ఇదంతా శివ స్వియానుభావంతోనే చెప్పినట్టు అనిపిస్తుంది. అవును మరి భద్ర, తులసి, సింహా, బృందావనం సినిమాలకు మంచి కధలను అందించినా శివ పేరు సాధారణ ప్రేక్షకులకు తెలియకపోవడం బాధాకరమేగా...