Begin typing your search above and press return to search.
ఆ మూడు సినిమాల్లోనూ హీరోలంతే
By: Tupaki Desk | 24 Aug 2016 5:30 PM GMTమామూలుగా స్టార్ డైరక్టర్లు అందరూ కథను ఒకటే ఫ్రేమ్ లో సెట్ చేసుకుని.. తమ క్యారెక్టర్ల తీరుతెన్నులు మారుస్తుంటారు. కాని స్వతాహాగా రచయిత అయిన కొరటాల శివ మాత్రం.. తన క్యారక్టర్లను ఒకేలా పెట్టుకుని.. కథను మాత్రం మారుస్తున్నాడు. ఫర్ సప్పోజు మనం ఒక్కసారి మిర్చి - శ్రీమంతుడు - జనతా గ్యారేజ్ సినిమాల్లో హీరోల క్యారెక్టర్లు చూస్తే ఆ విషయం తెలిసిపోతుంది.
'మిర్చి'లో ప్రభాస్ ఒక కాలేజ్ స్టూడెంట్.. తరువాత కత్తిపట్టే విలన్. ఇక 'శ్రీమంతుడు'లో మహేష్ బాబు కూడా అంతే.. ముందు ఒక స్టూడెంట్.. తరువాత విలేజ్ లో రెచ్చిపోయే ఒక సోషల్ యాక్టివిష్టు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా 'జనతా గ్యారేజ్'లో స్టూడెంట్ గా ముంబయ్ లో కనిపిస్తూ.. కొన్ని పోస్టర్లలో రాడ్ పట్టుకుని రఫ్ఫుగా కనిపిస్తున్నాడు.. అంటే స్టూడెంట్ నుండి తరువత జనతా గ్యారేజ్ సభ్యుడిగా మారి బెండు తీస్తాడనమాట. ఒక విధంగా చూస్తే కొరటాల తీసిన మూడు సినిమాల్లోని హీరోలు అంతే.
నిజానికి దీనిని ఎలా కంపేర్ చేయొచ్చంటే.. మన పురాణాల్లో దేవుళ్ళందరూ చూడండి.. కథలు మారుతాయి కాని క్యారక్టర్లు మారవు. అందరూ విలన్లను చంపడానికి కారణజన్ములుగా భూమ్మీద అవతరించిన వారే. సేమ్ టు సేమ్ కొరటాల అదే ప్యాట్రన్ ఫాలో అవుతున్నాడంతే. కాదంటారా?