Begin typing your search above and press return to search.
భరత్ అనే నేను.. ఐదు గంటల సినిమా!
By: Tupaki Desk | 8 April 2018 4:30 AM GMTమూడు గంటల సినిమాకే ఆశ్చర్యపోతుంటే.. ఐదు గంటల సినిమా ఏంటి అని విస్మయానికి గురవుతున్నారా..? ‘భరత్ అనే నేను’ నిడివి మూడు గంటల్లోపే ఉండొచ్చు కానీ.. ఈ సినిమా కథను మహేష్ బాబుకి దర్శకుడు కొరటాల శివ నరేట్ చేసింది మాత్రం ఐదు గంటలట. ప్రథమార్ధం రెండున్నర గంటల సేపు చెప్పిన కొరటాల.. ద్వితీయార్ధాన్ని కూడా అంతే నిడివితో చెప్పాడట. ఇంతసేపు కథ చెప్పాను కాబట్టి మహేష్ ఇబ్బంది పడతాడని.. మరీ ఐదు గంటల నరేషన్ ఏంటి అంటాడని అనుకున్నానని.. కానీ అతను మాత్రం సినిమా కూడా ఐదు గంటలు ఉంటుందా.. అలా ఉంటే బాగుంటుందేమో అని అన్నాడని కొరటాల వెల్లడించాడు.
‘భరత్ అనే నేను’ కథ చాలా పెద్దదని.. దీన్ని మహేష్ బాబుకు ఎలా చెప్పాలో అనుకున్నానని.. వేరే ఊరిలో ఒక హెల్త్ రిసార్టులో కూర్చుని మహేష్ కు ఈ కథ నరేట్ చేశానని కొరటాల చెప్పాడు. మహేష్ కు ఒక కథ నచ్చితే దాని కోసం ప్రాణం పెట్టేస్తాడని.. ‘శ్రీమంతుడు’ విషయంలోనూ అలాగే చేశాడని.. ఇప్పుడు ‘భరత్ అనే నేను’కు కూడా అలాగే కష్టపడ్డాడని అన్నాడు. మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాలో అందమైన చీఫ్ మినిస్టర్ గానే కాకుండా డైనమిక్ చీఫ్ మినిస్టర్ గా కనిపిస్తాడని కొరటాల చెప్పాడు. నిర్మాత దానయ్య మొదట్నుంచి తనకు ఒక రిచ్ అండ్ గ్రాండ్ మూవీ కావాలనే అడుగుతూ వచ్చాడని.. ఇలా అన్నాడు కదా అని తాను కూడా సినిమా కోసం చాలా ఖర్చు పెట్టించేశానని కొరటాల అన్నాడు. ‘ధోని’ సినిమాలో కియారా అద్వానీని చూసి నచ్చి.. తన సినిమాకు పర్ఫెక్టుగా సూటవుతుందని ఎంచుకున్నట్లు కొరటాల తెలిపాడు.