Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కోసం రాత్రుళ్లూ రాస్తున్నా-కొరటాల
By: Tupaki Desk | 28 Dec 2015 6:13 AM GMTఎన్టీఆర్, కొరటాల శివ మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినిమా ‘బృందావనం’తోనే కొరటాలకు రచయితగా బ్రేక్ వచ్చింది. ‘మిర్చి’తో దర్శకుడైన తర్వాత ఎన్టీఆర్ తో కచ్చితంగా సినిమా చేస్తానన్న కొరటాల.. తన మూడో సినిమానే అతడితో తీయబోతున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ సినిమా ఫిబ్రవరిలో సెట్స్ మీదికి వెళ్లనుంది. ప్రస్తుతం స్క్రిప్టు పూర్తి స్థాయిలో రెడీ చేసే పనిలో ఉన్నాడు కొరటాల. ఐతే ముందు మామూలుగానే స్క్రిప్టు రాసుకుంటూ ఉండేవాణ్నని.. ఐతే ‘నాన్నకు ప్రేమతో’ గురించి తెలిశాక మాత్రం మరింత జాగ్రత్త పడుతున్నానని అంటున్నాడు కొరటాల.
‘నాన్నకు ప్రేమతో’ ఆడియో ఫంక్షన్లో కొరటాల మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో చాలా ‘మా’లు ఉన్నాయి. మా అన్నయ్య తారక్.. మా ఫ్రెండు సుకుమార్.. మా దేవిశ్రీ ప్రసాద్.. మా ప్రసాద్.. ఇంతమంది మావాళ్లు కలిసి చేస్తున్న సినిమా ఇది. అందుకే ఇది నా సొంత సినిమాలాగా భావిస్తున్నా. ఎన్టీఆర్ సినిమా అంటేనే నాకు స్పెషల్. తన సినిమా అనగానే ఏం రాయాలి.. ఎంత బాగా రాయాలి.. అని ఆలోచించా. ఐతే ఇన్నాళ్లూ పగటి పూటే రాసుకునేవాడిని.. కానీ నాన్నకు ప్రేమతో గురించి తెలిశాక మాత్రం రాత్రుళ్లు కూడా రాసుకుంటున్నా. రాత్రింబవళ్లు రాసుకోవాల్సి వస్తోంది. సంక్రాంతి పండక్కి నా సొంత సినిమా కంటే ఎక్కువగా ‘నాన్నకు ప్రేమతో’ కోసం ఎదురు చూస్తున్నా. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు ఎలాంటి ఔట్ పుట్ ఇచ్చి ఉంటాడో ఊహించగలను. నాన్న మీద ప్రేమతో చేసిన సినిమా ఇది’’ అన్నాడు.