Begin typing your search above and press return to search.
సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన కొరటాల..!
By: Tupaki Desk | 25 Jun 2021 2:26 PM GMTసోషల్ మీడియా మాధ్యమాలు సెలబ్రిటీలకు వారిని ఫాలో అయ్యేవారికి అనుసంధాన కర్తగా ఉంటాయి. సినిమా వాళ్ళు మూవీ ప్రమోషన్స్ మొదలుకొని తమ పర్సనల్ విషయాల వరకు అన్ని సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు చేరవేస్తుంటారు. ఇక కరోనా విపత్కర పరిస్థితుల్లో సెలబ్రిటీలందరూ ప్రజలకు వైరస్ పట్ల అవగాహన కల్పించడానికి తమవంతు కృషి చేశారు. అదే సమయంలో చాలామంది సినీ ప్రముఖులు ఇతరత్రా కారణాలతో సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు.
కొరటాల శివ ఇన్నాళ్లూ సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలు వెల్లడిస్తూ వస్తున్నారు. ట్విట్టర్ లో 1.2 మిలియన్ల ఫాలోవర్స్ కలిగియున్న కొరటాల.. సినిమాల గురించే కాకుండా ప్రజా సమస్యలు - సమకాలీన విషయాలపై స్పందిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. "హలో, నేను సోషల్ మీడియా నుండి దూరంగా వెళ్తున్నట్లు మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. నాకు సంబంధించిన విషయాలను ఈ వేదికగా పంచుకున్నాను. కానీ ఇది నేను దూరంగా వెళ్లాల్సిన సమయం. మన మీడియా మిత్రుల ద్వారా నేను మీతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. కంటిన్యూగా ఇంటరాక్ట్ అవుతుంటాను. మీడియం మారింది కానీ మన మధ్య బంధంలో ఎలాంటి మార్పు ఉండదు'' అని కొరటాల శివ ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే కొరటాల శివ సడన్ గా ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం.. పూర్తిస్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టేందుకేనని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. కొరటాల ప్రస్తుతం చిరంజీవి - రామ్ చరణ్ లు హీరోలుగా 'ఆచార్య' సినిమా తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు.