Begin typing your search above and press return to search.
స్క్రిప్టు మార్చి తెరకెక్కిస్తావా కొరటాలా?!
By: Tupaki Desk | 6 Nov 2015 9:30 AM GMTమహేష్ నటించిన శ్రీమంతుడు సినిమాని చూడగానే చాలామంది బాలీవుడ్ లో విజయవంతమైన షారుఖ్ ఖాన్ స్వదేశ్ ని గుర్తుకు తెచ్చుకొన్నారంతా. దీంతో శ్రీమంతుడు బాలీవుడ్ కి వెళ్లడం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మామూలుగా తెలుగులో స్టార్లు నటించిన సినిమాలు బాగా హిట్టయ్యాయంటే అవి బాలీవుడ్ కి వెళ్లడం గురించి చర్చ జరుగుతుంటుంది. అలా శ్రీమంతుడు గురించి కూడా చర్చ జరిగినా స్వదేశ్ సినిమాలా ఉంది కాబట్టి హిందీకి వెళ్లడం కష్టమే అనుకొన్నారు.
కానీ హృతిక్ రోషన్ లాంటి యువ కథానాయకులు మాత్రం శ్రీమంతుడు సినిమాని రీమేక్ చేస్తే బాగానే ఉంటుందని భావిస్తున్నారు. లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉందని, దీన్ని కాస్త మార్పులు చేసి హిందీలో తెరకెక్కిస్తే సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయని హృతిక్ గట్టిగా నమ్ముతున్నాడట. ఆయనకి క్లైమాక్స్ నచ్చలేదట. దీంతో క్లైమాక్స్ ని మార్చేసి, అలాగే కథలోనూ కాసిన్ని ట్విస్టులు పెట్టేసి చేద్దామన్న అభిప్రాయంలో హృతిక్ ఉన్నాడట. తెలుగులో 150కోట్లకుపైగా వసూలు చేసిన సినిమా కాబట్టి ఇప్పటికే ఓ కార్పొరేట్ సంస్థ హిందీ రీమేక్ రైట్స్ ని చేజిక్కించుకొంది. హృతిక్ తో ఆ సంస్థ పలుమార్లు చర్చలు జరిపాక కొరటాలతోనే ఆ సినిమాని తెరకెక్కించాలని నిర్ణయించుకొన్నట్టు సమాచారం.
దీంతో కొరటాల శివకి ఫోన్ చేశారట. కథలో మార్పులు చేయాలన్న విషయం గురించి కొరటాల కూడా ఒప్పుకొన్నప్పటికీ ప్రస్తుతం ఆయన చేతిలో ఎన్టీఆర్ సినిమా ఉంది. అది పూర్తయ్యాకే హిందీ శ్రీమంతుడు గురించి ఆలోచిస్తానని చెప్పాడట. మరి హృతిక్ అంతవరకు ఆగుతాడా లేక వేరే దర్శకుడి చేతికి అవకాశమిస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొరటాల మాత్రం హిందీలో పనిచేసే అవకాశం గురించి ఆసక్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది.