Begin typing your search above and press return to search.
రెజీన-నివేద కర్కశ లేడీ పోలీసులా?
By: Tupaki Desk | 13 Jan 2020 12:30 PM GMTరీమేక్ లు చేయడంలో డి.సురేష్ బాబు రికార్డులు అన్నీ ఇన్నీ కావు. వెంకటేష్-సురేష్ బాబు కాంబినేషన్ అంటేనే రీమేక్ లకు ప్రసిద్ధి. ఇరుగు పొరుగున బ్లాక్ బస్టర్లు వెతికి పట్టుకుని మరీ రీమేక్ లు చేస్తుంటారు. ఇక ఇటీవలి కాలంలో కొరియన్ సినిమాల్ని బాలీవుడ్ సినిమాల్ని రీమేక్ చేయడంపై సురేష్ బాబు ప్రత్యేకించి ఆసక్తిని కనబరుస్తున్నారు. 2019లో మిస్ గ్రానీ రీమేక్ గా వచ్చిన ఓ బేబి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. సమంతకు ఈ సినిమా కొత్త ఇమేజ్ ని తెచ్చింది.
2020లోనూ డి.సురేష్ బాబు ఈ తరహా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తొలిగా అంధాధున్ రీమేక్ ని పట్టాలెక్కించనున్న సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. అలాగే కొరియన్ సినిమా మిడ్ నైట్ రన్నర్స్ ని తెలుగులోకి రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాకి కూడా సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఓబేబి సహనిర్మాత సునీత తాటి ఆ కొరియన్ సినిమాని నిర్మించనున్నారు. సురేష్ బాబు సమర్పకుడిగా కొనసాగనున్నారు.
ఆసక్తికరంగా ఈ రీమేక్ ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చేయడమే గాక లేడీ ఓరియెంటెడ్ కి కథను షిఫ్ట్ చేసేశారని తెలుస్తోంది. మాతృకలో ఇద్దరు విలువల్లేని కర్కశమైన మగపోలీసుల కథను చూపిస్తే.. తెలుగు రీమేక్ లో ఆ ఇద్దరూ లేడీ పోలీసులుగా మారారుట. ఆ రెండు పాత్రలకు రెజీన- నివేద థామస్ లను ఎంపిక చేశారు. ఆ ఇద్దరికీ కథ.. పాత్రలు నచ్చాయి. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నారని సమాచారం.