Begin typing your search above and press return to search.
చిరంజీవిపై కోట శ్రీనివాసరావు సంచలన విమర్శలు!
By: Tupaki Desk | 8 May 2022 3:31 PM GMTమెగా ఫ్యామిలీ టార్గెట్ గా సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల విమర్శనాస్ర్తాలు సంధిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. మేడే దినోత్సవం సందర్భంగా చిరంజీవి కార్మికుల కోసం ఆసుపత్రి నిర్మిస్తానని వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై కోట తనదైన శైలిలో స్పందించారు.
``కార్మికులకు కావాల్సింది కడుపు నిండా తిండి. ముందు ఆపని చూడండి. చిరంజీవి కట్టే ఆసుపత్రికి ఎవరొస్తారు? కృష్ణానగర్ లో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. వ్యసనాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ల దగ్గర డబ్బులంటే అపోలో ఆసుపత్రికి వెళ్తారని వ్యగ్యంగా స్పందించారు. కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే చిరంజీవి సినీ కార్మికుడు ఎలా అవుతారని ప్రశ్నించారు.
ఇలాంటి మాటలు నచ్చవని వాస్తవాలు మాట్లాడాలని అన్నారు. కార్మికుడు అన్న వ్యక్తి ఏనాడైనా ఎవరికైనా సహాయం చేసారా? ఆయన సినిమాల్లో ఎవరికైనా అవకాశాలు ఇప్పించారా? ఇలాంటి పనులు నేను చేయగలిగాను. నా ఇంటికి ఎవరైనా సహాయమని వస్తే 500..1000 ఇచ్చి పంపిస్తాను. ఇబ్బందుల్లో ఉన్న కార్మికుల కోసం 5 లక్షల వరకూ సహాయం చేసాను.
అంతేగానీ అది చేస్తా ఇది చేస్తా అని కబుర్లు చెప్పను. గతంలో `మా ` కోసం ఎన్నోసార్లు విరాళాలు ఇచ్చాను. వృద్దాప్యంలోనూ కార్మికుల సంక్షమ కోసం నిరాహార దీక్ష చేసాను. చిరంజీవిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ఆయనపై నా గౌరవం ఎప్పుడూ ఉంటుంది` అని కోట అన్నారు.
కొన్ని నెలల క్రితం `మా` ఎన్నికల సమయంలో మెగా బ్రదర్ నాగబాబు పైనా కోట తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకు ముందే మరోసారి మెగా హీరోని టార్గెట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి వీటిపై మెగా ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాలి. చిరంజీవి ఇలాంటి విమర్శల్ని పట్టించుకోరు. నాగబాబు మాత్రం కౌంటర్ గా దిగుతుంటారు. మరి కోట వ్యాఖ్యలపై మెగా బ్రదర్ బధులు ఎలా ఉంటుందోల చూడాలి.
ప్రస్తుతం కోట శ్రీనివాసరావు సినిమాలకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. వయసు మీద పడటంతో పెద్దగా అవకాశాలు రాలేదు. అప్పుడప్పుడు ముఖ్యమైన సినిమా వేడుకలకు హాజరవుతున్నారు.