Begin typing your search above and press return to search.
బ్రహ్మీ ఆలోచించాల్సిందే
By: Tupaki Desk | 14 March 2016 9:29 AM GMTవిషయం ఏదైనా సరే... కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం కోట శ్రీనివాసరావు ఆనవాయితీ. ఆయన ఎవ్వరికీ భయపడడు. మనసులో ఏదుంటే అది నిర్భయంగా చెబుతాడు. అవతలివాళ్లు ఎలా స్పందించినా ఫర్వాలేదంటాడు. కోటలోని ఆ లక్షణాన్ని చాలా మంది మెచ్చుకుంటుంటారు కూడా. నాపైనే కామెంట్ చేశాడేంటి అని అప్పటికప్పుడు ఎవరైనా ఫీల్ అయినా, ఆ తర్వాత ఆయన కామెంట్లలో వాస్తవాన్ని గ్రహించి మళ్లీ కోటకి దగ్గరవుతుంటారు. అలాంటి దాఖలాలు చాలానే ఉన్నాయి. తాజాగా కోట శ్రీనివాసరావు... బ్రహ్మీ యాక్టింగ్ పై తీవ్ర విమర్శలు చేశాడు. ఆరేళ్లుగా ఒకే పాత్రమీద బతుకుతున్నాడన్నారు. స్టార్ కమెడియన్ అనిపించుకొన్న బ్రహ్మీపై కోట ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే మెజారిటీ జనం కోట మాట్లాడిన మాటల్లో వందశాతం నిజముందని చెబుతున్నారు. బ్రహ్మానందంలాంటి నటుడు కేవలం ఒకట్రెండు పాత్రలకి పరిమితం కాకూడదంటున్నారు. మరి బ్రహ్మీ స్పందనేంటన్నది ఇప్పుడు చూడాలి.
కోట శ్రీనివాసరావు పద్మశ్రీ పొందిన గొప్ప నటుడు. బ్రహ్మానందం కూడా పద్మశ్రీనే. అయితే బ్రహ్మానందం చేస్తున్న పాత్రలే కోటకి నచ్చడం లేదు. అందుకే ఓ ఇంటర్వ్యూలో సంచలనాత్మకమైన ఈ కామెంట్లు చేశాడు. ``బ్రహ్మానందం ఏమనుకున్నా ఫర్వాలేదు, ఎన్నాళ్లా పాత్రలు చేస్తాడు? ఆయన గొప్ప నటుడు. కానీ సరిగ్గా వాడుకోలేదు. బ్రహ్మీని హీరో కొట్టాలి, జనాలు నవ్వాలి. అసలు అదేనా కామెడీ అంటే?`` అని ప్రశ్నించాడు ఓ ఇంటర్వ్యూలో కోట. మరి ఇందులోని నిజాన్ని బ్రహ్మీ గమనించాడా? ఇకనైనా ఆయన ఈ తరహా పాత్రలకి పుల్ స్టాప్ పెట్టేస్తాడా? చూడాలి.