Begin typing your search above and press return to search.
స్టార్ హీరోలపై కోటా ఘాటు వ్యాఖ్యలు
By: Tupaki Desk | 3 Jun 2023 10:05 AM GMTఈ మధ్యకాలంలో సీనియర్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు ఏ కార్యక్రమంలో పాల్గొన్న, ఇంటర్వ్యూలకి వెళ్ళిన కాస్తా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిపోయింది. ఒక్కోసారి ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకొని కోటా శ్రీనివాసరావు ఘాటుగా విమర్శలు చేస్తూ ఉంటారు. తాజాగా మరోసారి అలాంటి విమర్శలే స్టార్ హీరోలపై చేశారు.
సినిమా ఇప్పుడు ఒక సర్కస్ లా తయారైంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో చక్కనైన వాతావరణం ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా మాయమైంది. స్టార్ హీరోలు నేను రోజుకి రెండు కోట్లు తీసుకుంటున్నా, ఆరు కోట్లు తీసుకుంటున్న అని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఒకప్పటి హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ఎంత రెమ్యునరేషన్ తీసుకునేవారనేది ఎవరికి తెలియదు.
అలా చెప్పుకునే అలవాటు కూడా వారికి ఉండేది కాదు. నిర్మాత ఇచ్చినంత తీసుకునేవారు. ఇక సాంగ్స్ కూడా అర్ధం పర్ధం లేకుండా ఉంటున్నాయి. సంబంధం లేకుండానే సాంగ్స్ ని హీరోలు డాన్స్ లు చేస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ 60 ఏళ్ల వయస్సులో శ్రీదేవితో డాన్స్ చేస్తే వాళ్లిద్దరు మాత్రమే స్క్రీన్ పై కనపడ్డారు. వాటిని ప్రేక్షకులు ఆశ్వాదించారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఇండస్ట్రీలో లేదు. చిన్న ఆర్టిస్టులు బ్రతకడం కష్టంగా మారింది.
అలాగే చిన్న సినిమాలు రిలీజ్ చేసుకోలేని పరిస్థితిలో నిర్మాతలు ఉన్నారు. తెలుగు ఆర్టిస్ట్స్ తో సినిమాలు చేస్తే నిర్మాణ ఖర్చు తక్కువ అవుతుంది. చిన్న ఆర్టిస్టులు బ్రతుకుతారు. పోనీ అడ్వర్ టైజ్మెంట్స్ చేద్దాం అంటే బాత్ రూమ్ క్లీనింగ్ నుంచి బంగారం ప్రమోషన్ వరకు అన్ని హీరోలే చేసేస్తున్నారు.
ఇలా అయితే చిన్న ఆర్టిస్టులు బ్రతకడం కష్టం అయిపోతుందని ఒక మీటింగ్ లో కోటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల నుంచి కోటా శ్రీనివాసరావు తెలుగు నటులని ప్రోత్సహించాలి అంటూ మీడియాలలో చెబుతూనే ఉన్నారు.
అయితే నిర్మాతలు బిజినెస్ కోణంలో ఆలోచించుకొని తమ సినిమాకి ఎక్కువ రీచ్ ఉండాలని పరభాషా నటులని తెచ్చుకుంటున్నారు. సినిమాలో ఆర్టిస్ట్స్ ఎవరుండాలి అనేది దర్షకుడు, నిర్మాత ఇష్టం. చిన్న ఆర్టిస్ట్ లని ప్రోత్సహించడానికి వారేమీ ఎన్జీవో నడపడం లేదనే కామెంట్స్ కోటా శ్రీనివాసరావు కామెంట్స్ కి కౌంటర్ గా వస్తున్నాయి.