Begin typing your search above and press return to search.
డ్రింక్స్ యాడ్ లో పెద్దాయన
By: Tupaki Desk | 21 Feb 2018 11:26 AM GMTకార్పోరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం ఉపయోగించే బ్రాండ్ అంబాసడర్ల విషయంలో కొత్త పోకడలకు తెర తీస్తున్నారు. స్టార్ హీరోలతో చేయించే యాడ్స్ బడ్జెట్ పరంగా కూడా భారంగా మారుతూ ఉండటంతో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లతో ప్రయోగాలు మొదలు పెట్టారు. స్ప్రైట్ సాఫ్ట్ డ్రింక్ ప్రమోషన్ కోసం చేసిన కొత్త యాడ్ లో సీనియర్ విలన్ కం మల్టీ టాలెంటెడ్ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు కనిపించడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రావు రమేష్ లాంటి మధ్య వయస్కులు చేయటం సహజం కాని ఇలా కోట గారు ఈ అడ్వర్టైజ్మెంట్ లో కనిపించడం చూసి ప్రేక్షకులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదే యాడ్ హిందీలో పంకజ్ కపూర్ తో చేయించారు. మధ్య తరగతి పెద్దలకు దగ్గరవ్వాలనే ఉద్దేశంతో స్ప్రైట్ వేసిన ఎత్తుగడ మంచి ఫలితం ఇచ్చేలా ఉంది.
ఒకప్పుడు ఎస్వి రంగారావు గారు సైతం సిగరెట్ ఉత్పత్తులకు ప్రచారం చేసే వారు. అప్పట్లో టీవీ పూర్తిగా అందుబాటులో లేదు కాబట్టి ప్రింట్ మీడియాలో ఆయన ఎక్కువగా కనిపించారు. తర్వాత మొత్తం హీరో ఆధారిత పరిశ్రమ కావడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లతో యాడ్స్ తీసే సాహసం కంపెనీలు చేయలేకపోయాయి. ఇప్పుడు కోట చేయటంతో కొత్త ట్రెండ్ మొదలైంది అని చెప్పుకోవచ్చు. పెద్ద బ్రాండ్ కాబట్టి కోట యాడ్ కొత్తగా కనిపిస్తోంది కాని గతంలో పైపుల సంస్థ కోసం చలపతిరావు, మరొక స్థానిక బ్రాండ్ కోసం యముడి వేషంలో సత్యనారాయణ, రియల్ ఎస్టేట్ కోసం ఎస్పి బాలసుబ్రమణ్యం, చంద్ర మోహన్, శుభలేఖ సుధాకర్ ఇలా ఇంతకుముందు చేసారు కనక మరీ కొత్త క్యాటగిరీలో దీనిని వేయలేం.
ఆరోగ్యరిత్యా చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటున్న కోట శ్రీనివాసరావు గారు ఇలా యాడ్స్ కు ఓకే చెప్పడానికి కారణం చాలా సింపుల్. సినిమా అయితే ఎక్కువ కాల్ షీట్స్ అవసరం అవుతాయి. యాడ్ అయితే ఒక్క రోజు జస్ట్ ఓ గంటా లేదా రెండు గంటలు చేస్తే చాలు. పనైపోతుంది. ఇంత కన్నా రిస్క్ చేసే వయసు కాదు కాబట్టి కోట గారి నిర్ణయం కరెక్టే.