Begin typing your search above and press return to search.

'కొత్త కొత్తగా' రైటర్లను రంగంలోకి దింపారే!

By:  Tupaki Desk   |   7 Sep 2022 4:36 AM GMT
కొత్త కొత్తగా రైటర్లను రంగంలోకి దింపారే!
X
టాలీవుడ్ తెరను చాలా ప్రేమకథలు పలకరించాయి. ప్రేమకథలకు ప్రాణం ఫీల్ ... ఆ ఫీల్ మాటల్లోను .. పాటల్లోను కూడా ఉండాలి. మంచి కథాబలం ఉన్న ప్రేమకథలకు ఫీల్ తో కూడిన మాటలు .. పాటలు ప్రధానమైన బలంగా నిలుస్తాయి. అలాంటి ఒక ప్రేమకథను కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ, దానికి 'కొత్త కొత్తగా' అనే టైటిల్ ను సెట్ చేశారు. ఈ సినిమాతో కొత్త హీరో .. హీరోయిన్ పరిచయమవుతున్నారు. మురళీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి హనుమాన్ వామిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ సినిమాకి టలు రాసిన రైటర్లను పిలిచి, వాళ్ల సరదాగా ఒక చర్చా కార్యక్రమాన్ని ప్లాన్ చేసి సందడిగా నడిపించారు. ప్రమోషన్ ని కూడా కొత్త కొత్తగానే ప్లాన్ చేశారని అనిపించారు. ఈ ప్రమోషన్ లో అనంత శ్రీరామ్ .. కాసర్ల శ్యామ్ .. శ్రీమణితో పాటు సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర .. దర్శకుడు హనుమాన్ పాల్గొన్నారు. తమలో ఎవరికి వారికి సింగిల్ కార్డు అని చెప్పేసి , తలో పాటను రాయించారు అంటూ సరదాగా అనంత శ్రీరామ్ ఒక డ్రామాను ప్లే చేస్తూ అసలు కార్యక్రమంలోకి తీసుకుని వెళ్లడం నిజంగా కొత్తగానే ఉంది.

ఈ సినిమాలో తనకి ఇచ్చిన పాటను గురించి అనంత శ్రీరామ్ మాట్లాడుతూ .. 'ఈ సినిమాలో నేను ప్రియతమా .. ప్రియతమా' అనే పాటను రాశాను. 'ప్రియా నువ్వులేని ఈ జీవితం ఇంకెందుకూ .. నాకు చనిపోవాలని ఉంది. చనిపోతే పంచభూతాల్లో కలిసిపోతాం .. కానీ ఆ పంచభూతాలు నన్ను రిజెక్టు చేస్తున్నాయి అనే అర్థంలో రాశాను అంటూ ఆ పాటను వినిపించారు.

శ్రీమణి మాట్లడుతూ .. 'శేఖర్ చంద్ర సంగీతంలో గతంలో చాలానే పాటలు రాశాను. ఈ సినిమాలో నేను రాసిన 'క్రేజీ క్రేజీ' అనే పాట చాలా సరదాగా సాగుతుంది. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అన్నాడు.

కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ .. 'ఈ మధ్య కాలంలో నేను రాసిన టీజింగ్ సాంగ్స్ నాకు మంచి పేరును తెచ్చిట్టాయి.. ఈ సినిమాలో కూడా నాతో టీజింగ్ సాంగును రాయించారు. ట్యూన్ నాకు బాగా నచ్చింది .. మంచి మాస్ సాంగ్ అవుతుందని శేఖర్ చంద్రకి ముందే చెప్పాను. 'వాలు కన్నుల్లో'' అంటూ ఈ పాటను ఎత్తుకున్నాను. 'నిలువవే వాలు కనులదానా' అనే అలనాటి పాటనే ఈ పాటకి స్ఫూర్తి.

'నేను నీ బుక్కునైనా బాగుండేది .. వీ వేళ్లు తగిలి కొత్త రెక్కలు వచ్చేవి' అనే ప్రయోగాలు చేశాను" అని చెప్పాడు. చిలిపి శ్యామ్ .. శ్యామ్ లోనే ఛామ్ ఉందంటూ అనంత శ్రీరామ్ ఆయనను ఆటపట్టించాడు. ఈ సినిమాలోని పాటలన్నీ కూడా యూత్ కి కనెక్ట్ అవుతాయనే ఒక మెస్సేజ్ ను పంపడంలో ఈ ప్రమోషన్ సక్సెస్ అయిందనే చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.