Begin typing your search above and press return to search.

పెళ్లి త‌ర్వాతే ఆ న‌టి పీక్ స్టేజ్‌

By:  Tupaki Desk   |   9 July 2018 6:40 AM GMT
పెళ్లి త‌ర్వాతే ఆ న‌టి పీక్ స్టేజ్‌
X
సీనియ‌ర్ న‌టి కేఆర్ విజ‌య త‌న‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. త‌న పెళ్లి వివ‌రాల్ని వెల్ల‌డించారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక లేటుగా పెళ్లి చేసుకోవ‌టం ఇప్ప‌టి న‌టీమ‌ణుల‌కు అల‌వాటే.

మ‌రికొంద‌రు న‌టీమ‌ణులు త‌మ కెరీర్ బాగున్న‌ప్పుడు సినిమాల మీద దృష్టి పెట్టి.. కాస్త స్లో కాగానే పెళ్లి చేసుకొని ఇండ‌స్ట్రీని వ‌దిలేస్తుంటారు. అయితే..కెరీర్ బాగున్న‌ప్పుడే పెళ్లి చేసుకొని.. సినిమాలు కంటిన్యూ చేయ‌టం కొంత‌మంది న‌టీమ‌ణుల‌కే సాధ్య‌మ‌వుతుంది.కానీ.. పెళ్లి త‌ర్వాత పీక్ స్టేజ్ కు వెళ్లిన అతి కొద్దిమంది న‌టీమ‌ణుల్లో కేఆర్ విజ‌య ఒక‌రు.

సినిమా రంగంలోకి ఎంట‌రైన రెండేళ్ల‌కే ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త వేలాయుధ‌న్ నాయ‌ర్ ను పెళ్లాడారు. అప్ప‌టికే స‌ద‌రు పారిశ్రామిక‌వేత్త‌కు సొంతంగా చార్టెడ్ ఫ్లైట్ ఉండ‌టం విశేషం. ఈ పెళ్లి అప్ప‌ట్లో బాగా సెన్సేష‌న్ అయ్యింది. పెళ్లికి సంబంధించి కేఆర్ విజ‌య తాజాగా ఏం చెప్పారంటే.. "మాది ప్రేమ పెళ్లి. ఇద్ద‌రం ఒక‌రంటే ఒక‌రం ఇష్ట‌ప‌డ్డాం. వెంట‌నే పెళ్లి చేసుకున్నాం. కానీ ఎవ‌రికి చెప్ప‌కుండా దాచాం. ప్రెగ్నెంట్ గా ఉన్న‌ప్పుడు శ్రీ‌లంక‌కు తీసుకెళ్లారు. అక్క‌డ విమానం దిగి వెళ్లేట‌ప్పుడు ఎవ‌రో ఫోటోలు తీశారు. అలా మా పెళ్లి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన రెండేళ్ల‌కు పెళ్లి చేసుకున్నా. పాప పుట్టాక మ‌ళ్లీ యాక్ట్ చేయ‌టం మొద‌లు పెట్టాను. పాప పుట్టిన ఏడాది త‌ర్వాత కెరీర్ చూసుకోవాల‌ని ఆయ‌న చెప్పారు. రోజూ ఆఫీసుకు వెళ్లిన‌ట్లే వెళ్లాల‌న్నారు. ఆదివారం మాత్రం ప‌ని ఒప్పుకోవ‌ద్ద‌న్నారు. ప‌ని ఇష్టంతో చేయాలే కానీ.. క‌ష్టంతో చేయ‌కూడ‌ద‌ని చెప్పేవారు. ప‌దేళ్ల‌లో వంద సినిమాల్లో న‌టించా. పెళ్లి త‌ర్వాత పీక్స్ కు వెళ్లా. పెళ్లి నాటికే సొంత విమానం.. హోట‌ల్స్ ఉండేవి. త‌ర్వాత వాటిని మేనేజ్ చేయ‌లేక అన్నీ అమ్మేశారు" అని చెప్పారు. ఆ రోజుల్లోనే పెళ్లి చేసుకున్న త‌ర్వాత కెరీర్ పీక్స్ లో ఉండ‌టం.. ఒక వెలుగు వెల‌గ‌టం కేఆర్ విజ‌య‌కే సాధ్య‌మని చెప్ప‌క త‌ప్ప‌దు.