Begin typing your search above and press return to search.
`క్రాక్` రైట్స్.. భయపడి తక్కువకే ఇచ్చేశారా?
By: Tupaki Desk | 11 March 2020 6:54 AM GMTమాస్ రాజా రవితేజ కెరీర్ ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలు పోటీ పడి మరీ డిజాస్టర్లు అయ్యాయి. `టచ్ చేసి చూడు`..`నేల టిక్కెట్`.. `అమర్ అక్బర్ ఆంటోనీ` ఇటీవల విడుదలైన `డిస్కోరాజా` వరుసగా ఒకే రకమైన రిజల్ట్ ని ఇచ్చాయి. సక్సెస్ కోసం రాజా ఎంతో ఎఫెర్ట్ పెట్టి సినిమాలు చేసినా పప్పులేవీ ఉడకలేదు. ఏవీ వర్కవుట్ కాలేదు. డిస్కోరాజా పై చాలా ఆశలే పెట్టుకున్నా అడియాశలే అయ్యాయి. ఈ వరుస పరాజయాల నేపథ్యంలో రవితేజ మార్కెట్ పై చాలా ప్రభావం పడిందన్న విశ్లేషణ సాగుతోంది.
తాజాగా ప్రాజెక్ట్ `క్రాక్` పైనా ఆ ప్రభావం పడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ క్రాక్ అనే ప్రయోగం చేస్తున్నాన్నాడు. మాస్ ఎంటర్ టైనర్ ఇది. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. టీజర్ లో రవితేజ యాక్షన్ పీక్స్ లో నే ఉంది. రోటీన్ కి దూరంగా యాక్షన్ సీక్వెన్స్ తీశారు. మరీ భారీ అంచనాలు లేకపోయినా టీజర్ చూశాక కూస్తో బజ్ క్రియేట్ అయ్యిందన్న టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా బిజినెస్ ఎంత వరకూ వచ్చిందని ఆరా తీయగా ఆసక్తికర సంగతులే తెలిసాయి. క్రాక్ ఇంకా సెట్స్ లో ఉండగానే ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తవ్వడం షాకిస్తోంది.
అంతగా వరుస ప్లాప్ ల మీదున్న స్టార్ కి ఇంత వేగంగా బిజినెస్ ఎలా పూర్తయింది? అని ఆరాతీస్తే.. ఈ వ్యవహారాన్ని నిర్మాతలు చాలా సింపుల్ గానే తేల్చేసినట్లు సోర్సెస్ చెబుతున్నాయి. గత సినిమా `డిస్కోరాజా` డబుల్ డిజాస్టర్ రిజల్టును ఆధారం చేసుకుని క్రాక్ బిజినెస్ ని చుట్టేసినట్లు చెబుతున్నారు. హైప్ అంటూ హడావుడి చేస్తే ఉన్నది కూడా ఊడిపోతుందని భావించి నిర్మాతలు హుటాహుటిన తమను వెతుక్కుంటూ వచ్చిన వారిని వదులుకోవడం ఎందుకు? అని భావించి వెంటనే అమ్మేసి చేతులు దులుపుకున్నట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక డైరెక్టర్ కూడా వరుసగా ప్లాప్ ల్లోనే ఉన్నాడు. అతనిపై నమ్మకంతోనైనా పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతుందా? అంటే ఆ ఛాన్స్ కూడా లేదు. అందుకే ఇలా చిన్న మొత్తానికే బిజినెస్ పూర్తి చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇక ఏం చేయాలన్నా రాజా బాక్సాఫీస్ వద్ద నిరూపించుకోవాల్సిందే. సక్సెస్ కొట్టి గెలపు గుర్రమెక్కితే తప్ప మారు మాట్లడటానికి వీలు ఉండదు.