Begin typing your search above and press return to search.
'క్రాక్' కోసం అనిరుధ్ ఆలపించిన 'భలేగా తగిలావే బంగారం' సాంగ్..!
By: Tupaki Desk | 12 Dec 2020 12:15 PM ISTమాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ "క్రాక్". గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన 'క్రాక్' ఫస్ట్ లుక్ మరియు టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. అలానే దీపావళి నాడు రిలీజ్ చేయబడిన 'భూమ్ బద్దల్' లిరికల్ వీడియో కూడా భూమ్ బద్దలు చేసింది. ఈ క్రమంలో 'క్రాక్' నుంచి మరో సాంగ్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. 'భలేగా తగిలావే బంగారం..' అనే సాంగ్ ని డిసెంబర్ 13న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ స్వరపరిచిన ఈ పాటను యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ పాడటం విశేషం. ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కలిపి ఓ పాట చేయడంతో 'భలేగా తగిలావే బంగారం' సాంగ్ పై అంచనాలు పెరిగాయి. ఈ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. కాగా, సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ - సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేయనున్నారు.