Begin typing your search above and press return to search.
మూవీ మినీ రివ్యూ: ‘క్రాక్’
By: Tupaki Desk | 10 Jan 2021 4:32 AM GMTపోలీస్ సినిమా అనగానే మనకు ఓ నిజాయితీ పోలీస్ ఆఫీసర్ -ఓ పరమ దుర్మార్గుడైన విలన్ కళ్ల ముందు కనపడతారు. ఆ పోలీస్ ..ఆ విలన్ ఉన్న ప్రాంతానికి ట్రాన్సఫర్ అయ్యి వెళ్లటం..అక్కడ అతను చేసే కార్యకలాపాలను అడ్డుకోవటం..ఇన్నాళ్లూ ఏ పోలీస్ మరీ ఇంతలా అడ్డుకోలేదే అని విలన్ క్షోబపడి..ఆ హీరోని దారికి తెచ్చుకోవటానికి అతని ఫ్యామిలీని టార్గెట్ చేయటం...ఇలా సాగిపోతూంటుంది. ఇది ఎన్నో సార్లు చూసిన మ్యాటరే అయినా హీరో మారినప్పుడల్లా కొత్తగా ఫీలై - పరవశించిపోతూంటాము. అందుకు కారణం ఆయా దర్శకుల కథన నైపుణ్యం. అంటే స్క్రీన్ ప్లే. ఇదే ఈ క్రాక్ సినిమాని బీటలు తీయకుండా కాపాడింది. రిలీజ్ అవుతుందా లేదా అనే టెన్షన్ నుంచి హిట్ టాక్ కు లీడ్ చేసింది. అసలు ఇంతకీ ఈ డైరక్టర్ ఏమి మ్యాజిక్ చేసాడు. ఆ పాత కథ ఈ సారి ఎలా కొత్తగా చెప్పాడు అంటే...
అనగనగా ఓ పోలీసోడు. అతను పేరు పోత రాజు వీర శంకర్ (రవితేజ). అతనికో బలహీనత... బ్యాగ్రౌండ్ అని ఎవడైనా అంటే చాలు చెలరేగిపోయి..అవతలి వాళ్లు మక్కెలు విరగతీస్తూంటాడు. ఇలా తన లాఠీతో లా అండ్ ఆర్డర్ ని నడిపిస్తూ మూడు కేసులు - ఆరు ఫైట్స్ అన్నట్లు సాగిపోతున్న అతని వృత్తి జీవితంలోకి ఓ పెద్ద క్రిమినల్ ప్రవేశిస్తాడు. అతనే కటారి కృష్ణ (సముద్రఖని ). అతను అంటే ఎంతటివాడికైనా ప్రాణ భయం. అలాంటి వాడితో వీరశంకర్ తలపడతాడు. కటారి కృష్ణ మొదట లైట్ తీసుకున్నా ఆ తర్వాత అతన్ని వేసేయటానికి రకరకాల స్కెచ్ లు వేస్తాడు. కానీ వీరశంకర్ శక్తి ముందు అవన్నీ తేలిపోతాయి. దాంతో శంకర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. ఎన్ని చేసినా వీరశంకర్ తొణకడు. మీసం మీద నుంచి చెయ్యి తీయడు. కటారి కృష్ణను కటకటాల్లోకి తోస్తాడు. అసలు కటారి కృష్ణతో మన శంకర్ కు ఎక్కడ తగువు వచ్చింది. వీరశంకర్ ని మట్టుపెట్టడానికి ఏమి ఎత్తులు వేసాడు. వాటిని శంకర్ ఎలా చిత్తు చేసాడు వంటివి తెరమీద చూస్తేనే బాగుంటాయి.
నిజానికి ఈ సినిమాకు ఎంచుకున్న అసలు కథే చాలా పాతది. ఎమోషన్స్ ఉన్నా - వాటన్నింటినీ ఒక బలమైన సినిమాగా మార్చేంత కథనం అవసరం. ఈ విషయం గమనించినట్లుగా కేవలం ట్రిక్కీ స్కీన్ ప్లేతో నిలబెట్టాడు డైరక్టర్. అఫ్ కోర్స్ రవితేజ అండగా ఉండగా ఉండి కథను రక్తికట్టించాడనుకోండి. స్ట్రైయిట్ గా కథలోకి వెళ్లటం ఈ సినిమా చేసిన అతి మంచి పని. ఆ తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ పెద్దగా ఇంట్రస్ట్ గా లేకపోయినా విలన్ వచ్చాక కథ స్పీడుగా పరుగెత్తింది. ఇంట్రవెల్ ఫైట్ - క్లైమాక్స్ ఫైట్ అయితే కేక పెట్టించాయి. అలాగే కథ చెప్పే విధానంలో కొత్తగా విలన్ వైపు నుంచి ఓపెన్ చేసి కథ చెప్పించటం బాగుంది. దాంతో హీరో ఎలివేషన్ కు మరింత అవకాసం దొరికింది. ముఖ్యంగా హీరోయిజమంటే ఇలా ఉండాలీ, అలా ఉండాలీ అని కొన్ని సినిమా లెక్కలుంటాయి. ఆ లెక్క ప్రకారం కొలతలు ప్రకారం వెళ్తూనే కొన్ని కొత్తదనం నింపుకున్న మాస్ ఎలిమెంట్స్ నింపి ఫ్యాన్స్ చేత విజిల్స్ కొట్టించాడు డైరక్టర్. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో హీరోయిజం గురించి ఎంతచెప్పినా తక్కువే. అక్కడ రవితేజను తప్ప వేరే వాళ్లను ఊహించలేము. రవితేజ-శృతిహాసన్ మధ్య వచ్చే సీన్స్ ఎలా ఉన్నా రవితేజ-విలన్ సముద్ర ఖనిల కాంబినేషన్ లో వచ్చే కొన్ని సీన్స్ ఓ రేంజ్ లో విజిల్స్ వేయిస్తాయి.
అలాగే ఎన్ని మాస్ ఎలిమెంట్స్ ఉన్నా సినిమాకు సరైన ఎమోషన్ పడకపోతే వర్కవుట్ అవదు. ఆ విషయం ఈ డైరక్టర్ కు బాగా తెలుసు. అదే ఈ సారి ప్లే చేసాడు. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఎమోషనే! చాలా చోట్ల కట్టిపడేసే ఎమోషన్ సినిమాలో ఉంది. పోలీస్ కథలో ఈ తరహా ఎమోషన్స్ ఎప్పుడూ వర్కవుట్ అయ్యేవే! అయితే ఒక అదిరిపోయే ఫస్టాఫ్ తర్వాత సినిమా పూర్తిగా రివెంజ్ డ్రామాగా మారిపోయినట్లు కనిపిస్తూంటుంది. ఆ పాయింట్ చుట్టూనే కథ తిరగడం కొద్దిగా రొటీన్ గా అనిపిస్తుంది. శృతిహాసన్ పాత్రకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేదు. లుక్స్ కూడా సాదాసీదాగా ఉండడమే కాక ఆవిడ పాత్రకు కాస్త స్కోప్ ఉన్నా దాన్ని పూర్తిగా పక్కనపెట్టినట్లు చేసారు. ఆ క్యారక్టర్ పై ఉన్న ఒక్క ట్విస్ట్ ఫోర్సబుల్ గా ఉంది!
ఏదైమైనా సినిమా మాస్ కు పట్టేస్తుంది. మసాలా ప్రేక్షకులను మళ్లీ మళ్లీ రప్పిస్తుంది. రవితేజ ఈ సారి లెక్క తప్పలేదనిపిస్తుంది. టెక్నికల్ గానూ మంచి స్టాండర్డ్స్ లో సినిమా ఉండటం మరో ప్లస్. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అయితే ఇక చెప్పక్కర్లేదు. ఫైనల్ గా సినిమాటోగ్రఫీ - తమన్ ఇచ్చిన ఆర్ ఆర్ గురించి చెప్పుకోపోతే మహా పాపం. వాళ్లిద్దరూ రవితేజ తో సమానంగా సినిమాని నిలబెట్టేసారు.