Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : పోస్టర్ తో ‘క్రాక్’ స్టే హోం సందేశం
By: Tupaki Desk | 2 April 2020 5:40 AM GMTమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. వరుసగా ఫ్లాప్స్ చవి చూస్తున్న రవితేజకు ఈ సినిమా సక్సెస్ చాలా కీలకంగా మారింది. రవితేజ గతంలో పలు పోలీస్ చిత్రాల్లో నటించాడు. ఎక్కువ శాతం సక్సెస్ ను దక్కించుకున్నాయి. ఇక ఈ చిత్రంలో కూడా రవితేజ పోలీస్ గా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే విడుదలైన పోస్టర్ లో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం కరోనా టైం నడుస్తున్న కారణంగా ఎవరు బయటకు రావద్దంటూ ప్రముఖులు పలువురు సందేశాలు ఇస్తున్నారు. ఈ సమయం లో రవితేజ కూడా ఆ సందేశం తో వచ్చాడు.
నేడు శ్రీరామ నవమి సందర్బంగా క్రాక్ సినిమా మరో పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రవితేజ శృతి హాసన్ తో పాటు ఒక బాబును ఎత్తుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలాగే మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయండి అంటూ సందేశంను చిత్ర యూనిట్ సభ్యులు ఇస్తున్నారు. శ్రీరామ నవమికి క్రాక్ యూనిట్ సభ్యులు మాత్రమే తమ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు.
టాలీవుడ్ మొత్తం కూడా కరోనాతో ఎఫెక్ట్ అయ్యింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని బంద్ అయ్యి సినిమాల విడుదల విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇలాంటి సమయంలో క్రాక్ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి. ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఈ సినిమాను సమ్మర్ చివర్లో విడుదల చేయాల్సి ఉంది. కాని ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.