Begin typing your search above and press return to search.
ఇంత హడావిడి ఎందుకు క్రిష్
By: Tupaki Desk | 13 Feb 2019 7:03 AM GMTఇంకో వారం రోజుల్లో రాబోతున్న మహానాయకుడుకు సంబంధించిన నిర్ణయాల్లో అసలు క్రిష్ ప్రమేయం ఉన్నట్టు కనిపించడం లేదు. మొన్నటి దాకా సైలెంట్ గా ఉండి కేవలం తొమ్మిది రోజుల ముందు విడుదల తేదీని అనౌన్స్ చేయడం ఎందుకో ఎవరికి అంతు చిక్కడం లేదు. పైగా కథానాయకుడు నష్టాలు భర్తీ చేయకుండానే రెండో భాగాన్ని తెస్తుండటం పట్ల బయ్యర్లు సైతం గుర్రుగానే ఉన్నారు. నష్టాలను భర్తీ చేసేందుకు ఉచితంగా ఇస్తారు అనుకుంటే ఇలా చేశారేంటి అంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారట.
అయితే ఉన్నట్టుండి 22నే విడుదల చేయాలి అనే నిర్ణయం వెనుక క్రిష్ కంటే ఇతరత్రా కారణాలు బాలయ్యను ఎక్కువగా ప్రేరేపించినట్టు సమాచారం. ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ అయినప్పటికి అది అందరూ మర్చిపోయారని ఇది ఫ్రెష్ గా ప్రమోట్ చేద్దామని చెప్పినట్టు తెలిస్తుంది. అయితే కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో లేని హైప్ ఎక్కడి నుంచి తెస్తారో అంతు చిక్కని విషయం
మహానాయకుడుకి పాజిటివ్ గా కనిపిస్తున్న అంశం ఒక్కటే. పెద్దగా పోటీ లేకపోవడం. యాత్ర సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నప్పటికీ అప్పటికి స్లో అవ్వడంతో పాటు కావాల్సినన్ని థియేటర్లు అందుబాటులో ఉంటాయి. స్క్రీన్లు దక్కించుకోవచ్చు. కానీ ఓపెనింగ్స్ కి ఇదొక్కటే సరిపోదు. పైగా నెల తిరగడం ఆలస్యం కథానాయకుడు ఆన్ లైన్ లోకి రావడం కూడా కొంత ప్రభావం చూపించేదే. ఎలాగూ ఇదీ వస్తుందన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగితే నెల రోజులు ఆగాకే చూద్దామన్న నిర్ణయానికి వస్తారు. సో మహానాయకుడు మీద ఎంత నమ్మకం ఉన్నా ఇంత హడావిడి ఎందుకు పడుతున్నారు అనేదే అంతు చిక్కని ప్రశ్న