Begin typing your search above and press return to search.
‘ఎన్టీఆర్’ కోసం క్రిష్ ను అడిగారా?
By: Tupaki Desk | 1 May 2018 11:30 AM GMTఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. ఎన్టీఆర్ బయోపిక్ కోసం రెండేళ్ల పరిశోధన అనంతరం పక్కాగా స్క్రిప్టు రెడీ చేసుకుని.. తేజను దర్శకుడిగా ఫిక్స్ చేసుకుని.. అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరిపి.. ఇక షూటింగ్ మొదలెడదాం అనుకునే సమయానికి.. చిత్ర బృందానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈ చిత్రం నుంచి దర్శకుడు తేజ తప్పుకున్నాడు. దీంతో ఈ ప్రాజెక్టే అయోమయంలో పడిపోయింది. తేజను రీప్లేస్ చేసే దర్శకుడి కోసం చాలా పేర్లే పరిశీలించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఎవ్వరూ ఖరారవ్వలేదు. ఈ సినిమా తీయడం కత్తి మీద సామే కావడంతో పేరున్న దర్శకులెవరూ ముందుకు రావట్లేదని సమాచారం. చివరగా బాలయ్య తనతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తీసిన క్రిష్‌ను సంప్రదించినట్లు తెలిసింది.
ఐతే ప్రస్తుతం హిందీలో ‘మణికర్ణిక’ తీస్తున్న క్రిష్.. దాన్నుంచి బయటికి రావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. దీనికి తోడు స్క్రిప్టును పరిశీలించిన క్రిష్.. బాలయ్య కోరుకున్నట్లు సినిమా తీస్తే ఆసక్తి ఉండదని.. కొన్ని మార్పులు చేర్పులు అవసరమని అన్నట్లు సమాచారం. తేజకు ఏ విషయాల్లో అభ్యంతరాలున్నాయో.. క్రిష్ కు అక్కడే డౌట్లు కొట్టినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని అటు బాలయ్య... ఇటు క్రిష్ ఈ సినిమాకు కలిసి పని చేసే ఆలోచనను విరమించుకున్నారట. క్రిష్ తర్వాత బాలయ్య ఇంకెవరినీ సంప్రదించలేదని.. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తనే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది. సన్నిహితులు మొత్తంగా ఈ సినిమానే ఆపేద్దామని అన్నప్పటికీ బాలయ్య వెనక్కి తగ్గలేదని సమాచారం.