Begin typing your search above and press return to search.

అయినా క్రిష్ తగ్గట్లేదుగా..

By:  Tupaki Desk   |   26 Jan 2016 9:30 AM GMT
అయినా క్రిష్ తగ్గట్లేదుగా..
X
‘కంచె’ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాడు క్రిష్. కానీ ప్రశంసలైతే దక్కాయి కానీ.. కాసులు మాత్రం అనుకున్న స్థాయిలో దక్కలేదు. ఇది కమర్షియల్‌ గా వర్కవుటవుతుందా లేదా అని చూడకుండా, ఏమాత్రం రాజీ పడకుండా భారీగా ఖర్చు పెట్టి సినిమా తీశాడు. రెండో ప్రపంచ యుద్ధానికి వేదికైన జార్జియాకు వెళ్లి మరీ ప్రపంచ స్థాయిలో యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించాడు క్రిష్. ఈ కష్టానికి కాసుల రూపంలో ఫలితం దక్కకపోయినా.. క్రిష్ తగ్గట్లేదు. తన తర్వాతి సినిమాను కూడా ప్రపంచ స్థాయిలో తీయడానికే సిద్ధమవుతున్నాడు. ‘కంచె’ కథానాయకుడు వరుణ్ తేజ్‌తోనే ‘రాయబారి’ పేరుతో క్రిష్ కొత్త సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి కూడా తన ఫ్యామిలీ నిర్మాతలతోనే చేయబోతున్నాడు క్రిష్. వారితో కలిసి మరోసారి ఫారిన్ లొకేషన్ల కోసం వేట సాగిస్తున్నాడు. ‘కంచె’ తీసిన జార్జియా సహా కొన్ని దేశాల్లో పర్యటిస్తున్నాడు. మొన్న ఆదివారం ‘కంచె’ మూవీ టీవీలో ప్రిమియర్ షోగా ప్రసారమైంది. ఆ సందర్భంగా జార్జియా నుంచి జనాల్ని పలకరించాడు క్రిష్. కంచె టీవీ ప్రిమియర్‌ షో టైంకి హైదరాబాద్‌లో లేకపోవడం ఐరనీ అంటూనే.. ఆ సినిమా తీసిన జార్జియాలోనే తన నిర్మాతలతో కలిసి ఉండటం గొప్ప కోఇన్సిడెన్స్ అంటూ ట్వీట్ చేశాడు క్రిష్. ఆ సంగతలా ఉంచితే తన ప్రతి సినిమాలోనూ ఓ కమిట్మెంట్ చూపించే క్రిష్.. ‘కంచె’ కమర్షియల్‌గా నిరాశ పరిచినా, వెరవకుండా మరో భారీ ప్రయత్నాన్ని తలకెత్తుకుని సొంతంగా రిస్క్ చేయడానికి రెడీ అవతుండటం మాత్రం గొప్ప విషయమే.