Begin typing your search above and press return to search.

పాతిక లక్షల కథల్లో కంచె ఒకటి

By:  Tupaki Desk   |   18 Oct 2015 4:20 AM GMT
పాతిక లక్షల కథల్లో కంచె ఒకటి
X
అక్టోబర్ 22న వరుణ్ తేజ్ నటించిన కంచె రిలీజ్ అవుతోంది. నిజానికి గాంధీ జయంతి రోజునే విడుదల కావాల్సి ఉన్నా.. సెన్సార్ కూడా కంప్లీట్ అయిన మూవీని.. కారణం చెప్పకుండానే పోస్ట్ పోన్ చేశారు కంచె యూనిట్. అప్పటికే చాలా హైప్, క్రేజ్ ఉన్న మూవీ ఇది. ఎప్పుడు రిలీజైనా సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకం యూనిట్ కి ఉంది.

అక్కినేని వారసుడు నటించిన అఖిల్ మూవీ వాయిదా కారణంగా.. అక్టోబర్ 22న కంచెకు రిలీజ్ డేట్ సెట్ చేశారు. విడుదలకు మరో నాలుగు రోజులే సమయం మిగలడంతో.. ప్రమోషన్ కార్యక్రమాలను బాగా స్పీడప్ చేశారు కంచె యూనిట్. విభిన్నమైన నేపథ్యం ఉన్న కథను తెరకెక్కించిన దర్శకుడు క్రిష్.. మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు పంచుకున్నాడు.

పాతిక లక్షల కథల్లో కంచె కూడా ఒకటి అంటున్నాడు కంచె దర్శకుడు క్రిష్. "హిట్లర్ - ముస్సోలినీ లాంటి నియంతల కారణంగా రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. 25 లక్షల మంది ఇందులో పాలు పంచుకున్నారు. ఆ పాతిక లక్షల మంది సైనికుల్లో ఒక వ్యక్తి కథే కంచె స్టోరీ " అని చెప్పాడు క్రిష్.

ఈ కథను వేరే ఏ హీరోకి చెప్పలేదని.. ఈ స్టోరీ విన్న మొదటి హీరో వరుణ్ తేజ్ మాత్రమే అంటున్నాడు క్రిష్. సినిమా విడుదలయ్యాక నాగబాబు తనయుడు వరుణ్ యాక్టింగ్ కి ప్రశంసలు దక్కుతాయని ధీమాగా చెబ్తున్నాడు క్రిష్.