Begin typing your search above and press return to search.
ఘనంగా క్రిష్ నిశ్చితార్థం
By: Tupaki Desk | 25 Jun 2016 6:58 AM GMTప్రముఖ దర్శకుడు క్రిష్ నిశ్చితార్థం శనివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు - పరిమిత సంఖ్యలో హాజరైన సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. కేర్ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేసే రమ్యతో క్రిష్ కి పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. పెద్దలు కుదిర్చిన సంబంధం ఇది. శనివారం జరిగిన నిశ్చితార్థం వేడుకలో డాక్టర్ రమ్యకి ఉంగరం తొడిగాడు క్రిష్. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోంది. గమ్యంతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన క్రిష్ ప్రస్తుతం బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిని తెరకెక్కిస్తున్నారు. వేదం - కృష్ణం వందే జగద్గురుమ్ - కంచె లాంటి చిత్రాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు క్రిష్. గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాతే క్రిష్ పెళ్లి జరగొచ్చని తెలుస్తోంది.