Begin typing your search above and press return to search.

క్వీన్ తో క్రిష్ చరిత్ర ఖాయం

By:  Tupaki Desk   |   2 April 2017 10:12 AM GMT
క్వీన్ తో క్రిష్ చరిత్ర ఖాయం
X
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇప్పటికే తన ట్యాలెంట్ ను చాలాసార్లు ప్రూవ్ చేసేసుకుంది. ఇంత సాధించినా.. ఆమెకు ఇంకా డ్రీం ప్రాజెక్ట్ ఉంటుందంటే ఆశ్చర్యమే కానీ.. రాణి లక్ష్మీ బాయ్ జీవితాన్ని సినిమాగా చూపాలని.. ఆ రోల్ లో కనిపించాలన్నది ఆమె కల. ఒకానొక దశలో.. తనే స్క్రిప్ట్ రాసేసుకుని.. ఆ సినిమా తనే డైరెక్షన్ చేస్తానన్నట్లుగా కూడా చెప్పేసిందంటే.. ఆ పాత్రపై ఈమెకు ఎంత మక్కువో అర్ధమవుతుంది.

అయితే.. కేతన్ మెహతా దర్శకుడుగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని గతంలో అంతా అనుకున్నారు. కొంత వర్క్ కూడా జరిగింది. కానీ అప్పుడు ఆగిపోయిన ఆ ఆలోచన.. ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కేయగా.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ చేతికి ఈ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా చూడాలంటూ.. కంగనాకు రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఓ సమయంలో చెప్పడం.. క్వీన్ కి క్రిష్ ట్యాలెంట్ అర్ధం కావడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి.

క్రిష్ కి రాజమౌళికి ఉన్న సాన్నిహిత్యం.. విజయేంద్ర ప్రసాద్ ద్వారా ఈ ప్రాజెక్ట్ క్రిష్ చేతికి రావడానికి సాయం చేసిందననే టాక్ వినిపిస్తోంది. రాణీ లక్ష్మీ బాయి అసలు పేరైన 'మణికర్ణిక' అనే టైటిల్ పై ఈ చిత్రం తెరకెక్కనుండగా.. క్రిష్ సొంత బ్యానర్ అయినా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టెయిన్మెంట్స్ పై ఈ చిత్రం రూపొందనుంది. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ మరోసారి చారిత్రక చిత్రం చేయనుండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/