Begin typing your search above and press return to search.
పదెకరాల్లో బాలయ్య సినిమా
By: Tupaki Desk | 18 May 2016 9:30 AM GMTఏడెకరాల్లో బాలయ్య సినిమా అంటే ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో అన్నపూర్ణ వారి ఏడెకరాల స్టూడియో వుంది కాబట్టి. కానీ ఈ పదెకరాల మాటేంటి, అసలెప్పుడూ వినలేదే అనేదేగా మీ సందేహం. నిజమే... హైదరాబాద్‌లో పదెకరాల పేరుతో స్టూడియో ఏమీ లేదు. కానీ బాలయ్య కోసం ఇప్పుడు సిద్ధమవుతోంది. మరి ఆ స్టూడియో లైఫ్ లాంగ్ వుంటుందో లేదంటే మధ్యలోనే తీసేస్తారో తెలియదు కానీ... బాలయ్య నటిస్తున్న గౌతమి పుత్ర శాతకర్ణి షూటింగ్ ని పురస్కరించుకొని ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో పదెకరాల స్థలం కొని మరీ క్రిష్ సెట్లు వేస్తున్నాడట. చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా కట్టిస్తున్నారట. ఒక రకంగా అక్కడ ఒక మినీ స్టూడియో ఏర్పాటవుతుందన్నమాట.
సెట్లు వేసుకోవడానికి మనకు హైదరాబాద్ లో బోలెడన్ని స్టూడియోలు వున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీకయితే క్షణాల్లో సెట్లు తీర్చిదిద్దేటంత శక్తి - సామార్థ్యాలు వున్నాయి. కానీ క్రిష్ మాత్రం సొంతంగా స్థలం కొని అక్కడ సెట్లు వేయిస్తున్నాడట. ఆ సెట్లకి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే క్రిష్ ఆ ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. సినిమా షూటింగ్ పూర్తయ్యాక కూడా ఆ సెట్లు కొన్నాళ్లపాటు అలాగే ఉండాలనేది క్రిష్ అభిప్రాయమట. అలా ఉండాలంటే సెట్లు వేసుకొనే స్థలం సొంతమై వుండాలి కదా! అందుకే క్రిష్ పదెకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. మరి సీక్వెల్ ని దృష్టిలో ఉంచుకొనే ఆ సెట్లని అలాగే ఉంచాలనుకొంటున్నారా లేదంటే ప్రమోషన్ కార్యక్రమాల్ని దృష్టిలో ఉంచుకొని అందరికీ చూపించేందుకోసమని అలా సొంత స్థలంలో సెట్లు వేయిస్తున్నారా అనేది తెలియాల్సి వుంది. గౌతమీ పుత్ర శాతకర్ణి షూటింగ్ ప్రస్తుతం మొరాకోలో జరుగుతోంది. ఆ షెడ్యూల్ పూర్తయ్యాక హైదరాబాద్ లో వేయబోయే సెట్లోనే షూటింగ్ జరపున్నారని సమాచారం.