Begin typing your search above and press return to search.
పాపులర్ వీడియో గేమ్ స్ఫూర్తితో పవన్ దొంగతనం?
By: Tupaki Desk | 7 March 2020 5:14 AM GMTజన సేనాని పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు సినిమాలకు కమిటైపోయాడు. వీటిలో రెండు ఇప్పటికే సెట్స్ పై ఉండగా మిగతావి ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నాయి. కొన్నాళ్ల పాటు రాజకీయాలకు కాస్త విరామమిచ్చి పవన్ సినిమాలు చేస్తుండడంతో అభిమానుల ఆనంధానికి అవధుల్లేవ్. రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. ఇందులో ఒకటి వకీల్‌సాబ్. ఇప్పటికే వకీల్ సాబ్ లుక్ రిలీజైంది. ఇక క్రిష్ దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న రెండో చిత్రం సన్నివేశాలు కూడా చాలా ఆసక్తికరంగా తెరకెక్కుతున్నాయని చిత్ర యూనిట్ హుషారుగా చెబుతోంది.
ప్రస్తుతం యాక్షన్ సన్నవేశాల చిత్రీకరణ జరుగుతోంది. సముద్రంలో ఓడలో తరలిపోతున్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే ఫైట్ ని పవన్ పై చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలువనుందని తెలుస్తోంది. అయితే ఈ భీకర పోరాటానికి స్ఫూర్తి ఏదైనా ఉందా? అంటే.. `షాడో ఫైటర్` అనే పాపులర్ వీడియో గేమ్ ద్వారా ప్రేరణ పొందారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ యాక్షన్ పార్ట్ అభిమానులకు అదిరిపోయే కిక్ ఇస్తుందట. థియేటర్ లో ఈ ఫైట్ వచ్చినటప్పుడు విజిల్స్ పడడం ఖాయమన్న లీకులు అందాయి.
ఈ యాక్షన్ సన్నివేశంలో కోహినూర్ వజ్రాన్ని దొంగిలించేప్పుడు పవన్ కల్యాణ్ సాహసాలు గగుర్పొడిచేలా చిత్రీకరిస్తున్నారట. ఈ దొంగతనం సన్నివేశానికి పవన్ మార్క్ యాక్షన్ అదనపు అస్సెట్ కానుందట. తాజా లీకులతో అభిమానుల్లో ఎగ్జయిట్ మెంట్ పెరుగుతోంది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఏఎం రత్నం భారీ బడ్జెట్ ని వెచ్చిస్తున్నారని తెలుస్తోంది. ఈయన ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మిస్తున్నారంట. మరో వైపు ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈయన ఇప్పటి నుంచే క్యూరియాసిటీ పెంచే లలితమైన బాణీలు సమకూర్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.