Begin typing your search above and press return to search.
బాలయ్య అలా తప్పించుకున్నారు
By: Tupaki Desk | 31 Oct 2017 3:30 AM GMTషూటింగ్ లో ఊహించని ప్రమాదాలు జరుగుతుండడం కామన్. చిన్న చిన్న చేదు అనుభవాలు బాగానే ఎదురవుతుంటాయి. ఎక్కువగా యాక్షన్ సీన్స్ కి సంబందించిన షూటింగ్స్ లలో ఎవరో ఒకరు గాయపడుతుంటారు. హీరోలు కూడా ఒక్కోసారి పొరపాట్ల వలన గాయాలపాలవుతారు. అందుకే చిత్ర యూనిట్ ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది.
అయితే సీనియర్ హీరో బాలకృష్ణ కూడా చిత్ర యూనిట్ లోపం వలన ఒకసారి పెద్ద ప్రమాదంను ఎదుర్కొన్నారట. ఆ విషయాన్ని దర్శకుడు క్రిష్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వివరించాడు. ఆయన బాలయ్యతో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాను చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్ లో ఒక యాక్షన్ సిన్ ను చిత్రీకరించేటపుడు బాలయ్య గుర్రపు స్వారీ చేస్తూ కిందపడిపోయారట. హాలీవుడ్ సినిమాల్లో వాడే అరేబియన్ గుర్రాలని ఆ సినిమా కోసం వాడారట. అయితే బాలయ్య ఒక్క రోజులనే గుర్రాన్ని బాగా మచ్చిక చేసుకొని షూట్లో పాల్గొన్నాడు. ఆయనకు హార్స్ రైడింగ్ బాగా తెలుసని క్రిష్ చెప్పాడు.
అయితే సిన్ లో బాలకృష్ణ ఒక బాబును గుర్రం పై ఎక్కించుకొని వెళ్లాలి. గుర్రానికి ఇరువైపులా రెండు బాంబులను పేలేలా ప్లాన్ చేశాం. కానీ చిన్న లోపం వల్ల కుడివైపున ఉన్న బాంబు మాత్రమే పేలింది. దీంతో గుర్రం సడన్ గా ఎడమవైపు తిరగడంతో బాలకృష్ణ గారు అలాగే బాబుతో సహా కిందపడిపోయారు. అయితే బాలకృష్ణ గారు బాబును జాగ్రతగా పట్టుకున్నారు. ఇద్దరికి పెద్దగా గాయాలు కాకపోవడంతో అందరం ఊపిరి పీల్చుకున్నామని దర్శకుడు క్రిష్ వివరించాడు.