Begin typing your search above and press return to search.
'ఎన్టీఆర్'లోనూ గొడవలు నిజమే : క్రిష్
By: Tupaki Desk | 22 Feb 2019 1:28 PM GMT'మణికర్ణిక' చిత్ర హీరోయిన్ కంగనా రనౌత్ తో గొడవ కారణంగా క్రిష్ ఆ చిత్రం నుండి తప్పుకున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం విడుదల తర్వాత క్రిష్ తనకు క్రెడిట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వివాదం ముదిరింది, బాలీవుడ్ ప్రముఖులు సైతం క్రిష్ కు మద్దతుగా మాట్లాడారు. అదే సమయంలో 'ఎన్టీఆర్' చిత్రం షూటింగ్ సమయంలో కూడా గొడవలు అయ్యాయి అంటూ వార్తలు వచ్చాయి. అయితే అవి బయటకు వచ్చేంత పెద్దవి అవ్వలేదు. షూటింగ్ సమయంలో వివాదం గురించి మాట్లాడని క్రిష్ తాజాగా సినిమా విడుదల సమయంలో ఆ విషయమై స్పందించాడు.
'మహానాయకుడు' చిత్రం విడుదల సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో క్రిష్ మాట్లాడుతూ షూటింగ్ సమయంలో గొడవపై స్పందించాడు. 'ఎన్టీఆర్' షూటింగ్ సమయంలో చిన్న చిన్న గొడవలు వచ్చిన మాట వాస్తవమే అని, అయితే అవి సినిమాపై ప్రభావం చూపేంత పెద్దవి కావని అన్నాడు. షూటింగ్ సమయంలో చిన్న చిన్న గొడవలు ఏ సినిమాకు అయినా చాలా కామన్ అని, అయితే సినిమాపై అవి ఎక్కువగా ప్రభావం చూపవని అన్నాడు.
బాలకృష్ణ బంధువు 'ఎన్టీఆర్' నిర్మాణ కార్యక్రమాలు చూసేవారు. ఆయనతో క్రిష్ కు రెండు మూడు సార్లు విభేదాలు వచ్చాయట. అయితే బాలకృష్ణ సర్ది చెప్పడంతో ఇద్దరు కూడా వివాదాన్ని పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు మంచి పేరు అయితే వచ్చింది కాని, ఎందుకో ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లలేదు. దాంతో దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. 'ఎన్టీఆర్ మహానాయకుడు' పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. నేడు విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాకు టాక్ అయితే పాజిటివ్ గానే వచ్చింది. మరి కలెక్షన్స్ విషయం ఎలా ఉంటుందో అనేది కాలమే నిర్ణయించాలి.