Begin typing your search above and press return to search.

తొడ కొట్ట‌డానికి కార‌ణం ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   21 Jan 2017 11:07 AM GMT
తొడ కొట్ట‌డానికి కార‌ణం ఏంటో తెలుసా?
X
తెలుగు సినిమాల్లో తొడ కొట్టుడు... అన‌గానే అంద‌రికీ గుర్తొచ్చే హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఆయ‌న తొడ‌కొడితే ఆ కిక్కే వేరు. అభిమానుల ఈల‌లూ గోల‌లూ మామూలుగా ఉండ‌వు. అయితే... ఇలాంటివ‌న్నీ ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ క‌థ‌ల చిత్రాల్లో అయితే ఓకే. కానీ, ఒక చారిత్రక‌ నేప‌థ్యంతో తెర‌కెక్కిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిలో బాగుంటాయా..? అదీ క్రిష్ లాంటి ద‌ర్శ‌కుడి చిత్రాల్లో ఇలాంటి హీరోయిక్ షాట్స్ ఉంటాయా..? కానీ, బాల‌య్య 100 చిత్రంలో తొడ‌కొట్టిన స‌న్నివేశాలు ఉన్నాయి. అభిమానుల‌తో ఈల‌లు కూడా వేయించాయి. ఇంత‌కీ శాత‌క‌ర్ణి లాంటి క‌థాంశంలోకి ఈ తొడ‌కొట్టుడు సన్నివేశాలు ఎలా వ‌చ్చాయ‌నే విష‌యాన్ని ద‌ర్శ‌కుడు క్రిష్ ఓ ఇంట‌ర్వ్యూలో మ‌రో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళీతో పంచుకున్నాడు.

అంద‌రూ త‌న‌ను మొద‌ట్నుంచీ క్లాస్ డైరెక్ట‌ర్ అంటూ ఉంటార‌నీ, అదే సంద‌ర్భంలో మాస్ స‌న్నివేశాలు డీల్ చేయ‌లేన‌ని కూడా అనుకుంటూ ఉంటార‌న్నాడు క్రిష్‌. అందుకే శాత‌క‌ర్ణిలో కొన్ని స‌న్నివేశాల‌ను మాసీగా డీల్ చేద్దామ‌నీ, బాల‌య్య‌తో తొడ‌కొట్టే స‌న్నివేశాన్ని రాసుకున్నానని చెప్పాడు. అయితే, అనూహ్యంగా ఈ స‌న్నివేశం విష‌యంలో బాల‌య్య సందేహించార‌ట‌! ‘చారిత్రక నేప‌థ్యంలో సాగుతున్న క‌థ‌లో ఇలాంటి తొడ‌కొట్టే స‌న్నివేశాలు ఉంటే ఓకేనా.. ఒక‌టికి రెండుసార్లు ఆలోచించుకో అని నాతో బాల‌య్య‌ అన్నారు. బాగుంటుది సార్‌.. అభిమానుల‌కు ఎంతో న‌చ్చుతుంద‌ని చెప్ప‌గానే చేశారు’అని క్రిష్ చెప్పాడు.

అయితే, సినిమాలో మరో సన్నివేశంలో బాలయ్య రెండు తొడలు కొట్టే సన్నివేశం ఉంటుంది. దీని గురించి కూడా క్రిష్ చెప్పాడు. ‘రెండు తొడ‌లు కొట్టే సీన్ చూస్తుంటే నాకు అదోలా అనిపించింది. దాన్ని ఎడిటింగ్ లో క‌ట్ చేయించా. అయితే, సినిమా ర‌ష్ చూసిన వెంట‌నే బాల‌య్య నాకు ఫోన్ చేశారు. నా మాట విని ఈ ఒక్క‌ సీన్ య‌థాత‌థంగా ఉంచెయ్‌. అభిమానుల‌కు క‌చ్చితంగా న‌చ్చుతుంద‌ని బాల‌కృష్ణ చెప్ప‌డంతో ఉంచేశాను’ అని క్రిష్ చెప్పాడు. ఆ త‌రువాత‌, థియేట‌ర్ లో సినిమా చూస్తుంటే ఆ సీన్ రాగానే తానూ ఈల వేశాన‌ని అంటూ తొడ‌కొట్టుడు వెన‌కున్న క‌థ‌ను పంచుకున్నాడు. ఏదేమైనా.. తొడ‌కొట్టుడులో బాల‌య్య స్టైలే వేరు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/