Begin typing your search above and press return to search.

బిట్లు బిట్లుగా కథానాయకుడు

By:  Tupaki Desk   |   9 Jan 2019 3:32 PM IST
బిట్లు బిట్లుగా కథానాయకుడు
X
చాలారోజుల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్‌ కధానాయకుడు థియేటర్లలోకి వచ్చేసింది. సినిమా అన్నగారి జీవిత చరిత్ర. ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఆ తెలిసిన దాన్నే అద్భుతంగా ప్రతీ ఒక్కరికి నచ్చేలా తీయగలగాలి. కానీ ఇక్కడే క్రిష్‌ దొరికిపోయాడు. సినిమాలో అన్నీ సీన్స్ ఉన్నాయి కానీ వాటి తాలూకూ ఎమోషన్‌ మాత్రం కన్పించలేదు.

సినిమా మొదలైనప్పుడు నుంచి అయిపోయేవరకు ప్రతీ సీన్‌.. ఒక బిట్‌ గానే ఉంటుంది. అంతేతప్ప.. ఎన్టీఆర్‌ హీరో అవ్వడం - హీరో తర్వాత ఒక స్టార్‌ గా మారడం - పౌరాణికాలు - జానపదాల నుంచి.. సాంఘికానికి షిఫ్ట్‌ అయ్యే సంఘర్షణను - అప్పడు ఆయనకు కలిసొచ్చిన అంశాల్ని.. ఇలా ఏవీ ఎమోషన్‌ లాగా కనెక్ట్ చేయలేకపోయాడు. అదే మహానటి సినిమాకు వచ్చేసరికి నాగ్‌ అశ్విన్‌ రీసెర్చ్‌ మనకు స్పష్టంగా కన్పిస్తుంది. సావిత్రి జీవితాన్ని కూడా సినిమా షూటింగ్‌ లో భాగం చేసేశాడు. అందుకే మనకు మహానటి బాగా నచ్చింది. సూపర్‌ హిట్‌ అయ్యింది. ఓవరాల్‌ గా ఎన్టీఆర్‌ బయోపిక్‌ అనే దండ కోసం అద్భుతమైన పూలు తెచ్చాడు క్రిష్‌. కానీ ఆ పూలన్నింటిని కలిపే దారం అనే ఎమోషన్‌ ని మాత్రం మిస్‌ అయ్యాడు.