Begin typing your search above and press return to search.
బాలయ్య 100.. క్వాలిటీ మాటేంటో!!
By: Tupaki Desk | 11 April 2016 10:28 AM GMTమూడు నెలలకు పైగా సమాలోచనల తర్వాత బాలయ్య తన వందో సినిమా గురించి అధికారికంగా ప్రకటించేశారు. క్రిష్ దర్శకత్వంలో తన ల్యాండ్ మార్క్ మూవీ చేయబోతున్నానని, గౌతమీపుత్ర శాతకర్ణిగా నటిస్తున్నానని చెప్పారు బాలకృష్ణ. ఇప్పుడీ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ పై అంతటా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బాలకృష్ణ చిత్రం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్న దర్శకుడు క్రిష్.. ఈ మూవీకి సంబంధించిన కీలక విషయాలను కొన్నింటిని పంచుకున్నాడు.
గౌతమీపుత్ర శాతకర్ణిపై పక్కా ప్లానింగ్ తో ఉన్న క్రిష్.. నిడివి విషయంలో కూడా ముందునుంచే ప్లానింగ్ లో ఉన్నాడు. కథ - కథనంలో వేగం తగ్గకుండా ఉండడంకోసం 2గంటల 10 నిమిషాల డ్యురేషన్ మాత్రమే ఉంటుందని చెప్పాడు క్రిష్. అలాగే ఈ చిత్రానికి 50 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు, అనుకున్న బడ్జెట్ లోనే ఖచ్చితంగా సినిమా చేస్తానని తేల్చేశాడు. బాలయ్య కెరీర్ లో ఇప్పటివరకూ 50 కోట్ల సినిమా లేదు కాబట్టి.. ఈ బడ్జెట్ ఎక్కువే అనచ్చు కానీ.. సెంచరీ మూవీకి ఉండే క్రేజ్ తో పోల్చుకుంటే దీన్ని తక్కువ మొత్తం అనాల్సిందే. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఇది చారిత్రాత్మక చిత్రం. ఖచ్చితంగా సెట్టింగుల వంటివాటికే బోలెడంత ఖర్చు అవుతుంది. ఇక యుద్ధ సన్నివేశాల్లాంటివాటికి భారీగా క్యాస్టింగ్ - గ్రాఫిక్స్ తప్పనిసరి.
మరి బడ్జెట్ ను ఎక్కువగా డిమాండ్ చేసే ఇలాంటి మూవీని.. 50 కోట్లతో తీయడం సాధ్యమా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఒకవేళ తీసేసినా.. క్వాలిటీ మాటేంటి అనిపించచ్చు. ఇప్పుడున్న ట్రెండ్ - బడ్జెట్ ప్రకారం బాలయ్య సినిమా బాహుబలి రేంజ్ లో ఉండాలని కోరుకోకపోవచ్చు. కానీ కనీసం గుణశేఖర్ రూపొందించిన రుద్రమదేవికి మించి అయితే ఖచ్చితంగా క్వాలిటీ ఉండాలి. అది కూడా చారిత్రాత్మక చిత్రం కావడమే ఇందుకు కారణం. మరి గౌతమీపుత్ర శాతకర్ణి మూవీని క్రిష్ ఏ రేంజ్ క్వాలిటీతో చూపించనున్నాడో?