Begin typing your search above and press return to search.
కంచె కథ అలా పుట్టింది..
By: Tupaki Desk | 15 Sep 2015 9:30 AM GMTతెలుగులో చారిత్రక నేపథ్యాలతో సినిమాలు తీయడమే చాలా తక్కువ. అందులోనూ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ రియలిస్టిక్ ఫిలిం వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఐతే డైరెక్టర్ క్రిష్ ఈ సాహసం చేశాడు. కృష్ణం వందే జగద్గురుం తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తర్వాత ఓ గొప్ప ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ‘కంచె’ అనే ఓ అందమైన ప్రేమకథను చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంకో రెండు వారాల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చడీచప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ - ట్రైలర్ లతో ఒక్కసారిగా అందరినీ విస్మయానికి గురి చేసింది. ఓ అద్భుత చిత్రం చూడబోతున్నామన్న ఫీలింగ్ కలిగించింది. ఐతే తెలుగులో ఎవ్వరూ చేయని ప్రయోగానికి క్రిష్ ఎందుకు సిద్ధమయ్యాడు? ఇలాంటి కథతో సినిమా తీయడానికి ఆయనకు స్ఫూర్తినిచ్చింటి? అసలు కంచె కథ ఎలా పుట్టింది? ఈ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘వేదం సినిమా కోసం నేను - అల్లు అర్జున్ వైజాగ్ వెళ్లాం. అక్కడ నేవీ మ్యూజియంలో ఓ బాంబు చూశాం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విశాఖపట్నం తీరంలో మందుగుండు సామగ్రితో వెళ్తున్న నౌకను లక్ష్యంగా చేసుకుని విసిరిన బాంబు అది. ఐతే అదృష్టవశాత్తూ అది పేలలేదని.. పేలి ఉంటే విశాఖ రూపు రేఖలు మారిపోయి ఉండేవని తెలిసింది. అప్పటిదాకా రెండో ప్రపంచ యుద్ధానికి మనకు ఏ సంబంధం లేదనుకునేవాణ్ని. ఇక వేదం తమిళ వెర్షన్ తీస్తుండగా తమిళనాడులోని ఓ ప్రాంతంలో ఓ చెట్టియార్ ఇల్లు కనిపించింది. అందులో రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు సంబంధించిన చిత్రపటాలు - వాళ్లకొచ్చిన మెడల్స్ - విక్టోరియా రాణి పంపిన ధ్రువపత్రాలూ కనిపించాయి. అప్పుడు ఇంకా ఆసక్తి కలిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో మన దేశ పాత్ర ఎంత అని అధ్యయనం చేశా. పాతిక లక్షల మంది భారత సైనికులు యుద్ధంలో పాల్గొన్నారని.. 24 వేల మంది చనిపోయారని.. 65 వేల మంది గాయపడ్డారని.. 11 వేల మంది జాడ తెలియలేదని తెలిసింది. ఈ అంకెలు చూసి షాకయ్యా. అప్పుడే యుద్ధ నేపథ్యంలో ఓ అందమైన ప్రేమకథ చెప్పాలని నిర్ణయించుకున్నా. కంచె కథ రాశా’’ అని క్రిష్ చెప్పాడు.