Begin typing your search above and press return to search.
కంగనా బుద్దిని బయటపెట్టిన క్రిష్
By: Tupaki Desk | 27 Jan 2019 4:56 AM GMTమణికర్ణిక ఫలితం ఊహించినట్టే నిరాశ కలిగించడంతో నిజాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. షూటింగ్ జరుగుతున్నంత కాలం దీని గురించి మాట్లాడేందుకు ఇష్టపడని క్రిష్ ఇప్పుడు గళం విప్పుతున్నాడు. అసలు మణికర్ణిక తన చేతుల్లో నుంచి ఎప్పుడో జారిపోయిందని తాను తీసిన సీన్స్ కంగనా రీ షూట్ చేయడం తప్ప కొత్తగా జోడించింది ఏమి లేదని చెప్పాడు. ఇంట్రోతో పాటు రెండు మూడు సన్నివేశాలు మాత్రమే వాళ్ళు తీసుకున్నారని మిగలిన భాగం మొత్తం తాను తీసిందే అని చెప్పుకొచ్చాడు.
సినిమా సగం పూర్తయ్యాక భోజ్ పూరి తరహలో అనిపిస్తోందని కంగనా చెప్పినప్పుడు తన మీద నమ్మకం పెట్టమని చెప్పినా సహా నిర్మాతతో కలిసి కుట్ర పన్ని తనను తప్పించారని చెప్పాడు. అంతే కాదు రెమ్యునరేషన్ కూడా ముప్పై శాతం మాత్రమే ఇచ్చారని మరో బాంబు పేల్చాడు. సోనూ సూద్ విషయంలోనూ కంగనా తో భేదాభిప్రాయాలు రావడం వల్లే ఇద్దరూ తప్పుకున్నామని క్లారిటీ ఇచ్చాడు
అంతా బాగానే ఉంది.ఇక్కడ కొన్ని విషయాలకు క్లారిటీ రావాలి. కంగనా అలా బయటికి పంపే దాకా వచ్చినప్పుడు క్రిష్ ఆ సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నాడు. ప్రాజెక్ట్ తన చేతుల్లోకి తీసుకుని డెబ్బై శాతం దాకా పారితోషికం బాకీ పెట్టినప్పుడు విడుదల అయ్యాకే ఎందుకు చెబుతున్నాడు. ఎన్టీఆర్ షూటింగ్ జరుగుతున్నంత కాలం మణికర్ణిక కనీసం ఓ చిన్న మాట కూడా చెప్పేందుకు ఇష్టపడని క్రిష్ వివాదాలు వద్దనుకున్నా అని సమర్ధించుకోవచ్చు కాని ఇప్పుడు ఫలితం తెలిసాక పబ్లిక్ గా స్పందించడం దేనికి.
ఒకవేళ బ్లాక్ బస్టర్ అయ్యుంటే క్రిష్ ఇదే విధంగా తన ప్రమేయం లేకుండా తీసుకున్నారని చెప్పెవాడా. ఇవి పక్కన పెడితే ఈ మొత్తం వ్యవహారంలో కంగనా వ్యవహరించిన తీరు ముమ్మాటికి అభ్యంతరకరమే. కాని నిర్మాతలు దర్శకులు నటుల మధ్య వ్యవస్థీకృతమైన సంఘాలు ఉండగా వాటిని సంప్రదించకుండ ఇలా మీడియా ముందు కంగనా క్రిష్ లు ఒకళ్ళ మీదకు ఒకళ్ళు తోసేసుకోవడం కూడా అంతు చిక్కని ప్రశ్నే. మొత్తానికి మణికర్ణిక బాలీవుడ్ లో సినిమాలు చేయాలనీ తహతహలాడే తెలుగు దర్శకులకు గొప్ప గుణపాఠం నేర్పించింది. దీన్ని మేలుకొలుపుగా తీసుకుని ఇకనైనా జాగ్రత్త ఉండటం మంచిది. లేకపోతే ఇలా ఎవరి పేరు కిందనో దర్శకత్వపు టైటిల్ కార్డును షేర్ చేసుకోవాల్సి ఉంటుంది