Begin typing your search above and press return to search.
తేజ స్క్రిప్ట్ వేరు.. ఇది నా సొంతం
By: Tupaki Desk | 14 Jan 2019 11:31 AM GMT"ఎన్టీఆర్" మూవీ భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. సినిమా కలెక్షన్స్ విషయం పక్కన పెడితే ఈ సినిమా గురించి తెగ చర్చ జరగడం తో పాటు అంతా కూడా దర్శకుడు క్రిష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాకు ఈ స్థాయి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఖచ్చితంగా క్రిష్ అంటూ అంతా బాహాటంగానే అంటున్నారు. మొదట ఈ సినిమాకు తేజను అనుకున్నారు. కానీ ఆతర్వాత క్రిష్ రంగంలోకి దిగాడు.
ఎన్టీఆర్ సినిమా బాధ్యతను తేజకు అప్పగించిన సమయంలో దాదాపు రెండు నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ చేసాడు. ఆ తర్వాత సినిమా ప్రారంభోత్సవం కూడా చేశాడు. ఆ తర్వాత తప్పుకున్నాడు. కనుక తేజ రెడీ చేసిన స్క్రిప్ట్ తోనే సినిమా తెరకెక్కిందనే టాక్ ఉంది. కానీ ఆవార్తలను దర్శకుడు క్రిష్ కొట్టిపారేశాడు. తన సొంత స్క్రిప్ట్ తోనే సినిమాను చేసినట్లుగా చెప్పుకొచ్చాడు.
తాజాగా క్రిష్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా తేజ గురించి స్పందిస్తూ.. ఈ సినిమాను తేజ గారు ఎందుకు వదిలేశారో నాకు తెలియదు. కానీ ఇలాంటి అదృష్టాన్ని నాకు దక్కింది. ఎన్టీఆర్ సినిమా టైటిల్స్ కార్డు లో నాపేరు రావడం నా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నాను. నావద్దకు ఒక స్క్రిప్ట్ ను నిర్మాత తీసుకు వచ్చారు. కానీ నేను అన్ని పూర్తిగా మార్చి మళ్ళీ నా స్టయిల్ లో మార్చనంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ కథానాయకుడుకి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.