Begin typing your search above and press return to search.

పెళ్లి.. శాతకర్ణి.. వాటే ప్లానింగ్‌

By:  Tupaki Desk   |   1 July 2016 6:23 AM GMT
పెళ్లి.. శాతకర్ణి.. వాటే ప్లానింగ్‌
X
బాలకృష్ణ వందో సినిమా.. నందమూరి అభిమానులను విపరీతంగా ఎగ్జైట్ చేస్తున్న పాయింట్ ఇది. సినిమా అనౌన్స్ మెంట్ తో మొదలు.. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి గౌతమిపుత్ర శాతకర్ణిగా బాలయ్యను ఎప్పుడు చూస్తామా అనే ఆతృతలో ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమా వచ్చేది సంక్రాంతికే అని తెలిసినా.. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకుంటూ థ్రిల్ ఫీలవుతున్నారు.

ఇంతలోనే దర్శకుడు క్రిష్ పెళ్లి సంగతి తెలిసి కొంచెం వర్రీ అయిపోయారు. శరవేగంగా షూటింగ్ చేస్తున్నా ఆగస్ట్ లో క్రిష్ పెళ్లి అనగానే కంగారు పడ్డారు. షూటింగ్ కి ఏదైనా గ్యాప్ వస్తుందేమో.. సినిమా లేట్ అవుతుందేమో అన్నదే వాళ్ల టెన్షన్. అయితే.. క్రిష్ ప్లానింగ్ చూస్తే ఇలాంటి వర్రీస్ అన్నీ దూరమైపోతాయి. ఆగస్టు 8న పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ దర్శకుడు అందుకు తగ్గట్లుగానే ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే శాతకర్ణి కోసం జార్జియాలో కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ కి ప్లాన్ చేసుకున్నాడు క్రిష్. ఆ షెడ్యూల్ యథాతథంగా కొనసాగనుందని.. షూటింగ్ కి ఎటువంటి గ్యాప్ లు, బ్రేక్ లు ఉండవని తెలుస్తోంది.

పెళ్లి కోసం ఓ చిన్న బ్రేక్ మాత్రమే తీసుకోనున్న ఈ దర్శకుడు.. తక్కువ టైంలోనే షూటింగ్ లో భాగం కానున్నాడట. అంతే కాదు.. పెళ్లి సమయంలో కూడా క్రిష్ టీమ్ కొన్ని వర్క్స్ ని పూర్తి చేస్తూనే ఉండేలా ప్లాన్ చేశాడట. దీంతో అసలు గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ కి గ్యాప్ వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. క్రిష్ అంటే ట్యాలెంటెడ్ డైరెక్టర్ అని తెలుసు కానీ.. మరి ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్ అన విషయం ఇప్పుడే చాలామందికి అర్ధమవుతోంది.