Begin typing your search above and press return to search.
బాలయ్య బిడ్డతో పాటు గుర్రంపై నుంచి పడితే..
By: Tupaki Desk | 8 Jan 2017 6:36 AM GMT‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అంత సులువేం కాదు. అందులోనూ ఇలాంటి సినిమాను 79 వర్కింగ్ డేస్ లో పూర్తి చేశారంటూ ఆ చిత్ర యూనిట్ సభ్యులు ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. బాలయ్య ఈ వయసులో ఇలాంటి సినిమాను అంత వేగంగా పూర్తి చేయగలిగారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ సినిమా కోసం బాలయ్య పడ్డ కష్టం ఎలాంటిదో ఆడియో వేడుకలో క్రిష్ వివరంగా చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ లో బాలయ్య గాయాలు కూడా అయ్యాయట. అందులోనూ ఒక పసిబిడ్డను చేతబట్టుకుని యుద్ధంలో పాల్గొనే సన్నివేశంలో బాలయ్య గుర్రం మీది నుంచి పడ్డాడని.. ఆ సందర్భంగా ఆ బిడ్డకు చిన్న గాయం కూడా కాకుండా బాలయ్య ఎంతో నేర్పుగా వ్యవహరించాడని క్రిష్ వెల్లడించాడు.
‘‘ఓ ఘట్టంలో గౌతమిపుత్ర శాతకర్ణి తన బిడ్డ పులోమావిని తీసుకుని యుద్ధానికి బయల్దేరతాడు. ఆ సన్నివేశాన్ని చిత్రీస్తున్నప్పుడు.. చుట్టూ అగ్నిగోళాలు మండుతూ ఉంటాయి. గుర్రం కాస్త ముందుకెళ్లాక అగ్ని గోళాలు ఒకవైపున మాత్రమే పేలడం మొదలుపెట్టాయి. రెండోవైపు ఆగిపోవడంతో ముందుకెళ్లాల్సిన గుర్రం పక్కకి తిరిగింది. దీంతో బాలకృష్ణ గుర్రం మీది నుంచి పసివాడితో సహా కిందపడిపోయారు. అయినా బిడ్డకు ప్రమాదం జరగకుండా భద్రంగా ఒడిసిపట్టుకున్నారు. ఆ పరిస్థితుల్లో కూడా తన గురించి పట్టించుకోకుండా.. ‘బిడ్డకేం కాలేదు కదా..’ అని ఆందోళన చెందారు. కేవలం అర గంట విశ్రాంతి తీసుకుని మళ్లీ షూటింగుకి వచ్చేశారు. రెట్టించిన ఉత్సాహంతో యుద్ధ సన్నివేశంలో నటించారు. ఈ సంఘటన మొరాకోలో జరిగింది. ఇదంతా చూసిన విదేశీయులు మీ హీరో రియల్ హీరో అంటూ మెచ్చుకున్నారు’’ అని క్రిష్ తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/