Begin typing your search above and press return to search.
అవార్డు వస్తుందని ఆశించలేదట
By: Tupaki Desk | 28 March 2016 11:30 AM GMTప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు పొందిన క్రిష్ రూపొందించిన కంచె చిత్రం జాతీయ అవార్డు దక్కించుకుంది. ఉత్తమ తెలుగు చిత్రంగా కంచె ఎంపికైంది. ఈ ఆనందాన్ని దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి అందరితో పంచుకుంటున్నాడు. తాను రూపొందించిన కంచె.. ఈ అవార్డు గెలుచుకోవడం ఆనందంగా ఉన్నా.. ఈ స్థాయి గౌరవాన్ని అసలు ఆశించలేదని చెబుతున్నాడు.
'కంచె చిత్రం అవార్డు గెలుచుకున్నందుకు ఆనందంగా. వస్తుందని ఆశించకపోయినా.. ఆ చిత్రానికి ఆ అర్హత ఉంది' అన్నాడు క్రిష్. రెండో ప్రపంచయుద్ధం బ్యాక్ డ్రాప్ తో తీసిన ఈ మూవీ తెలుగు ఆఢియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆసమయంలో భారతీయ సైనికులు ఫేస్ చేసిన పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించడంలో.. దర్శకుడు విజయవంతం అయ్యాడు. ఆ సమయంలోని పరిస్థితులను సూక్ష్మంగా విశ్లేషించి రూపొందించడంతోనే ఈ అవార్డు గెలుచుకోగలిగామని అన్నాడు క్రిష్.
'కంచె కోసం టీ అంతా ఎంతో కష్టపడ్డాం. మా కష్టానికి తగిన ప్రతిఫలం ఇది' అన్నాడు క్రిష్. వరుణ్ తేజ్ - ప్రగ్యా జైస్వాల్ లు నటించిన కంచె.. కమర్షియల్ గా నూ సక్సెస్ అనిపించుకుంది. మరోవైపు కంచె మూవీ అద్భుతం అని, అవార్డు అందుకునేందుకు అన్ని అర్హతలు ఉన్న చిత్రం అని.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించడం విశేషం.