Begin typing your search above and press return to search.
బాలయ్య అమ్మా అని అరిస్తే...
By: Tupaki Desk | 21 Jan 2017 8:27 AM GMT‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కోసం బాలయ్య పడ్డ కష్టమేంటో డైరెక్టర్ క్రిష్ ఆల్రెడీ మీడియాతో పంచుకున్నాడు. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య కష్టం గురించి మరింత వివరంగా తెలిపాడు క్రిష్. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఎవ్వరూ పడనంత శ్రమ బాలయ్య పడ్డాడని.. ఆయన గాయాలైనా పట్టించుకోలేదని క్రిష్ తెలిపాడు. ఓ సందర్భంలో గుర్రం మీది నుంచి బాలయ్య పడ్డపుడు మొత్తం యూనిట్ అంతా తీవ్ర ఆందోళనకు లోనైందన్నాడు.
‘‘నాకు తెలిసి టాలీవుడ్లో బెస్ట్ హార్స్ రైడర్స్ లో బాలయ్య ఒకరు. ఆయన గుర్రాన్ని అద్భుతంగా నడిపిస్తారు. శిక్షణ ఇచ్చిన గుర్రాలతో పాటు కొండల్లో తిరిగే వైల్డ్ హార్సెస్ ను కూడా ఆయన అదుపు చేశారు. జార్జియాలో షూటింగ్ చేసినపుడు అక్కడి స్టంట్ మాస్టర్లు కూడా బాలయ్య వేగం చూసి ఆశ్చర్యపోయారు. ఆయన వాళ్లందరినీ వెనక్కి నెట్టి దూసుకెళ్లిపోయేవారు. గుర్రాన్ని బాగా మచ్చిక చేసుకుని తనకు కావాల్సినట్లు నడిపించేవాళ్లు.
అయినప్పటికీ ఆయన రెండుసార్లు గుర్రం మీది నుంచి ప్రమాదకర రీతిలో కింద పడ్డారు. ఒకసారి రెండు వైపులా బాంబులు పేలుతుంటే బాలయ్య తన సైన్యంతో కలిసి ముందుకు దూసుకెళ్లే సన్నివేశం తీశాం. ఒక టేక్ బాగానే అయ్యింది. ఇంకో టేక్ చేద్దామనుకున్నపుడు ఒకవైపు మాత్రమే బాంబు పేలింది. రెండో వైపు పేలలేదు. దీంతో గుర్రం అదుపు తప్పి రెండో వైపు ఒరిగింది. తన చేతిలో బిడ్డతో ఉన్న బాలయ్య దబేల్ మని కింద పడ్డారు. వెనుక పదుల సంఖ్యలో గుర్రాలు దూసుకొస్తున్నాయి. ఐతే ఒక స్టంట్ మాస్టర్.. తన గుర్రాన్ని అడ్డం తిప్పి వాటన్నింటినీ ఆపేశాడు.
బాలయ్య అప్పుడు కూడా బిడ్డకేమైనా అయిందేమో అని చూశారు తప్ప తన గురించి ఆలోచించలేదు. ఇంకో సందర్భంలో గుర్రంతో ఒక ట్రయల్ వేసి వచ్చాక.. షాట్ చేయడం కోసం ఎక్కబోయారు. గుర్రం బెల్ట్ ఊడిపోయి కింద పడ్డారు. అప్పుడాయన అమ్మా అని గట్టిగా అరవడంతో మాకు గుండెల్లో కలుక్కుమంది. ఒక రకమైన వణుకు పుట్టింది. పెద్ద గాయం అయిందనుకున్నాం. కానీ ఆయన గంట సేపు విరామం తీసుకుని మళ్లీ షూటింగుకి వచ్చేశారు. ఎంత చెప్పినా వినలేదు’’ అని క్రిష్ తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/