Begin typing your search above and press return to search.

నా వెర్షన్ బంగారం.. కంగనాది వెండి: క్రిష్

By:  Tupaki Desk   |   28 Jan 2019 3:08 PM GMT
నా వెర్షన్ బంగారం.. కంగనాది వెండి: క్రిష్
X
ఎంతో కాలంగా వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ చిత్రం 'మణికర్ణిక' రిపబ్లిక్ డే వీకెండ్ లో రిలీజ్ అయింది. ఈ సినిమానుండి దర్శకుడు క్రిష్ తప్పుకున్న తర్వాత కంగనా రనౌత్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి మిగతా పోర్షన్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. అసలు క్రిష్ సినిమా నుండి ఎందుకు బైటకు వచ్చాడు.. ఈ సినిమాపై వివాదాలు రేగిన సమయంలో ఎందకు మౌనంగా ఉన్నాడు.. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ వాటికి తనవైపు వెర్షన్ విన్పించాడు క్రిష్.

సినిమా సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉందన్న క్రిష్ ఇప్పుడున్న సినిమాలో 70% తను డైరెక్ట్ చేసిందేనని తెలిపాడు. తను డైరెక్ట్ చేసిన వెర్షన్ కనుక మొత్తం అలానే ఉంచితే ఈ సినిమా ఎంతో మెరుగ్గా ఉండేదని.. తన వెర్షన్ బంగారం అయితే ఇప్పుడు ప్రేక్షకులు చూస్తున్నది వెండి లాంటిదని అభిప్రాయపడ్డాడు. ఝాన్సి రాణి పై సినిమాకు ఒప్పుకోవడానికి కారణం కంగనానే అని.. తను ఒక వండర్ఫుల్ ఆర్టిస్ట్ అని తెలిపాడు. కానీ సినిమాలో స్ట్రాంగ్ గా ఉన్న ఇతర పాత్రల ప్రాముఖ్యతను తగ్గించమనడం తనకు నచ్చలేదని అందుకే సినిమానుండి బయటకు వచ్చానని తెలిపాడు.

ఈ సినిమాకు 109 రోజులు పనిచేశానని ఎన్టీఆర్ బయోపిక్ కు ఇందులో సగం రోజులు మాత్రమే పని చేశానని తెలిపాడు. 'మణికర్ణిక' ఆగష్టు 15 వ తేదీ 2018 లో విడుదల కావలసిందని.. జూన్ లోనే సినిమా పూర్తి చేశానని తెలిపాడు. ఒక చిన్న పోర్షన్ మాత్రమే పెండింగ్ ఉండిపోయిందని తెలిపాడు. డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్.. అంతా పూర్తయిన తర్వాత సినిమానుండి బయటకు వచ్చానని అన్నాడు. కంగనా 4-5 రొజులు మాత్రమే షూట్ చేస్తానని చెప్పిందని.. అది కూడా షూటింగ్ అప్డేట్ తనకు ఇస్తానని కూడా చెప్పిందని కానీ తర్వాత సీన్ మొత్తం మారిందని అన్నాడు. ముప్పై రోజులు షూట్ చేసిన సోను సూద్ పాత్రను లేపేసి.. అతుల్ కులకర్ణి పోషించిన పాత్ర ప్రాముఖ్యతను తగ్గించి తన పాత్రను హైలైట్ చేసుకుందని విమర్శించాడు. సినిమా తీసిన ఉద్దేశం కంగనాను గొప్పగా చూపించడం కాదు.. ఝాన్సి రాణి చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమని అన్నాడు. క్రిష్ తన వెర్షన్ తాను వినిపించాడు. మరి ఫైర్ బ్రాండ్ అయిన కంగనా ఈ విమర్శలు విని ఊరుకుంటుందా? క్రిష్ కు ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.