Begin typing your search above and press return to search.
క్రిష్ గురువు గారు హర్టయి కొన్నాళ్లు మౌనంగానే..!
By: Tupaki Desk | 6 Sep 2021 5:31 AM GMTప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి- స్టార్ ఫిలిం మేకర్ క్రిష్ ల మధ్య గురుశిష్యుల బంధం ఉంది. క్రిష్ దర్శకుడు కాకముందే సిరివెన్నెల వద్ద అసిస్టెంట్ గా పనిచేసారు. చాలా కాలకాలం పాటు శిశ్యరికంలో చాలా నేర్చుకున్నారు. అలా సీతారామశాస్త్రికి ప్రియ శిశ్యుడిగా క్రిష్ మారిపోయారు. క్రిష్ లో ప్రతిభను మెచ్చి గురువుగారు అతన్ని స్నేహితుడిగాను స్వీకరించారు. అందుకే క్రిష్ గురువు గారిని తండ్రి సమానులని... మంచి స్నేహితుడని కూడా సంబోధిస్తుంటారు. మరి అంతటి గురువునే శిశ్యుడు హర్ట్ చేసారా? అంటే అవుననే అన్నారు క్రిష్. సెప్టెంబర్ 5 గురుపుజోత్సం సందర్భంగా ఈ విషయాన్ని క్రిష్ రివీల్ చేసారు.
క్రిష్ `గమ్యం` సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత `వేదం`..`కృష్ణం వందే జగద్గురం`..`కంచె` లాంటి విభిన్న చిత్రాల్ని తెరకెక్కించి దర్శకుడిగా తనదైన మార్క్ వేసారు. ఈ సినిమాలన్నింటికి సీతారామశాస్త్రి పాటలు రచించారు. అయితే `కృష్ణం వందే జగద్గురం` సినిమా కు 14 నిమిషాల నిడివితో కూడిన ఓ పాట రాసారుట. కానీ ఆ పాటను పూర్తి స్థాయిలో వినియోగించలేదని క్రిష్ తెలిపారు. అప్పటికి దర్శకుడిగా మూడవ సినిమా కావడంతో పాటు ఎంతవరకూ వాడుకోవాలో తెలియని డైలమాలో పాటలో చాలా పదబందాల్ని తప్పించినట్లు తెలిపారు.
ఆ విషయంలో క్లారిటీ లోపించిందని అన్నారు. సినిమా పూర్తయిన తర్వాత ఆయన ఏకాగ్రత అంతా ఎడిటింగ్ పైనే ఉంటుందని...ఆ కారణంలో పాటలో గొప్పదనాన్ని పట్టించుకోలేదని క్రిష్ తెలిపారు. సినిమా లెంగ్త్ ఎక్కువ అవుతుందన్న కారణంగా పాటలో పదాల్ని స్కిప్ చేసినట్లు చెప్పారు. దీంతో సీతారామా శాస్త్రి ఎంతో ఫీలయ్యారని అన్నారు. అతని మాట వినలేదని కొన్ని రోజులు పాటు తనతో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారన్నారు. ఆ తర్వాత కొంత కాలానికి అన్ని సద్దుకున్నాయని అన్నారు. అలాగే ఇదే ఇంటర్వ్యూలో సీతారామశాస్త్రి పాల్గొని తాను పది మాటలు చెబితే... పదకొండవ మాట కోసం వెయిట్ చేసే మెండి ఘటం క్రిష్ అని అన్నారు. అలాగే `గమ్యం` ట్రెండ్ సెట్టర్ అని..`కంచె` మాస్టర్ పీస్ అని గురువుగారు వర్ణించారు. ప్రస్తుతం క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో `హరి హర వీరమల్లు` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే `కొండపొలం` విడుదల విషయంలోనూ క్రిష్ బిజీగా ఉన్నారు. గురువు గారి విషయంలో జరిగిన తప్పిదాన్ని క్రిష్ నిజాయితీగా అంగీరించడం చాలా గొప్పతనం అని అంగీకరించాలి.