Begin typing your search above and press return to search.
క్రిష్ మాస్టర్ ప్లాన్ వర్కవుటవుతోంది
By: Tupaki Desk | 26 Oct 2015 9:39 AM GMT‘కంచె’ లాంటి సినిమాకు రూ.20 కోట్ల బడ్జెట్ అంటే చాలా తక్కువే. కానీ ‘కంచె’ ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రం నచ్చే అవకాశం ఉండటంతో ఆ బడ్జెట్ రికవర్ చేయడం కూడా కష్టమే అన్నట్లుంది పరిస్థితి. ఐతే కమర్షియల్ హంగుల గురించి.. కలెక్షన్ల గురించి ఆలోచించకుండా.. ఏ విషయంలోనూ రాజీ పడకుండా తానేం తీయాలనుకున్నాడో అది తీసినందుకు క్రిష్ ను అభినందించాల్సిందే. ఐతే ఎంత పేరు వచ్చినా డబ్బులు రాకుంటే ఎవరికైనా కష్టమే కదా. కంచె పరిస్థితి చూస్తుంటే బడ్జెట్ మొత్తం రికవర్ చేయడం కష్టమే అన్నట్లుంది. మరి ‘కంచె’ ద్వారా క్రిష్ ఏం బావుకున్నట్లు అంటే.. అతడి ప్రణాళికలు అతడికున్నాయి.
‘కంచె’ బాక్సాఫీస్ రన్ ఎలా ఉన్నా.. ఈ సినిమాతో బాలీవుడ్ దృష్టిని ఆకర్షించవచ్చని అతను నమ్మాడు. ఏ పెద్ద నిర్మాణ సంస్థకైనా ఈ సినిమా నచ్చితే ఓ పెద్ద హీరోను పెట్టి హిందీలో రీమేక్ చేయొచ్చని భావించాడు. కంచె విడుదలకు ముందే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇప్పుడిక సినిమా విడుదలయ్యాక దాని గురించి వస్తున్న ప్రశంసలు ఆటోమేటిగ్గా బాలీవుడ్ నిర్మాణ సంస్థల చెవిన పడ్డాయి. దీంతో ‘కంచె’ను రీమేక్ చేయడానికి కొన్ని సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు.. క్రిష్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అదే జరిగితే క్రిష్.. ఇక్కడ పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువే సంపాదించేందుకకు అవకాశముంటుంది. ఇక్కడ ‘కంచె’కు అన్నీ తానే కాబట్టి రీమేక్ అంటే లాభాల్లో వాటా ఒప్పందం మీద సినిమా తీస్తాడు. అక్కడ భారీ కాన్వాస్ లోనే సినిమా తీస్తాడు కాబట్టి వాటా కింద పెద్ద మొత్తమే వచ్చే అవకాశముంది. కాబట్టి ‘కంచె’ రీమేక్ ఓకే అయితే.. క్రిష్ మాస్టర్ ప్లాన్ వర్కవుటైనట్లే.