Begin typing your search above and press return to search.
క్రిష్ ఖాళీగా లేడు
By: Tupaki Desk | 15 Jun 2019 9:41 AM GMTఎన్టీఆర్ డిజాస్టర్ ఫలితం దర్శకుడు క్రిష్ కన్నా బాలయ్యకే ఎక్కువ డ్యామేజ్ చేసినప్పటికీ అప్పటి నుంచి ఇద్దరూ సైలెంట్ గానే ఉన్నారు. ఇంతకాలం క్రిష్ ఏం చేస్తున్నాడు ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే సందేహాలు సహజంగానే సినిమా ప్రేమికులకు వచ్చింది. ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ కాకపోవడం ఫలానా హీరోతో చేయబోతున్నట్టుగా ఎలాంటి లీక్స్ లేకపోవడం చూసి క్రిష్ ఇంకెంత గ్యాప్ తీసుకుంటాడా అనే అనుమానం కలిగింది.
కాని వాస్తవంగా క్రిష్ తెరవెనుక ఓ వెబ్ సిరీస్ కు రచన పూర్తి చేశాడట. తన స్వంత బ్యానర్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పేరు మీద నిర్మించేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నట్టుగా తెలిసింది. కథ స్క్రీన్ ప్లే తో పాటు మాటలు కూడా క్రిష్ రాసుకుని ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశాడట. దీనికి దర్శకత్వం వహిస్తారా లేదా అనే క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది. ఆ బాద్యతలు వేరొకరికి అప్పజెప్పే అవకాశమే ఎక్కువగా ఉంది. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ ల ట్రెండ్ ఉదృతంగా ఉంది. సినిమాలకు ఏ మాత్రం తీసిపోని కంటెంట్ క్వాలిటీతో అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ జీ 5 హాట్ స్టార్ సంస్థలు విపరీతంగా పోటీ పడుతున్నాయి.
వీటినే తెలుగుతో సహా సౌత్ బాషలు అన్నింటిలోకి డబ్బింగ్ చేస్తున్నారు. ఇప్పుడు క్రిష్ ప్లాన్ చేస్తోంది కూడా అలాంటిదే కావొచ్చు. ఎపిసోడ్ల రూపంలో డిఫరెంట్ జానర్స్ లో వస్తున్న వెబ్ సిరీస్ లకు విపరీతమైన ఆదరణ దక్కడంతో ఇంకొందరు టాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాతలు వీటి వైపు కాస్త సీరియస్ గానే లుక్ వేస్తున్నారు. చూస్తుంటే రానున్న రోజుల్లో ఇదో పెద్ద ట్రెండ్ గా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది